KohiNoor: కోహినూర్ విలువ ఎన్ని లక్షల కోట్లో తెలుసా?

KohiNoor: కోహినూర్ విలువ ఎన్ని లక్షల కోట్లో తెలుసా?


ప్రారంభంలో దీని బరువు.. 793 క్యారెట్లు. అంటే.. 156 గ్రాములు. అయితే, ప్రస్తుతం దాని బరువు కేవలం 105.6 క్యారెట్లు మాత్రమే. అంటే 21.12 గ్రాములు మాత్రమే. గణపతి దేవుడి నుంచి ఎందరో రాజుల చేతులు మారుతూ వచ్చిన ఈ వజ్రం.. 17వ శతాబ్దం నాటికి మహారాజా రంజిత్ సింగ్ వశమైంది. రంజిత్ సింగ్ మరణానంతరం సింహాసనం కోసం పోటీ ఏర్పడింది. చివరకు 1849లో పంజాబ్‌ను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ రాష్ట్ర ఆస్తిని ఈస్ట్ ఇండియా కంపెనీ జప్తు చేసింది. కోహినూర్‌ను ఇంగ్లండ్ రాణికి బహుమతిగా అందించారు. లార్డ్ డల్హౌసీ దీనిని 1850లో ఇంగ్లండ్‌కు పంపించాడు. క్వీన్ విక్టోరియా మొదట తన కిరీటంలో ఈ వజ్రాన్ని పొదిగించి.. ధరించేది. తర్వాత 1902లో రాణి పెద్ద కొడుకు కింగ్ ఎడ్వర్డ్ పట్టాభిషేకం సందర్భంగా, ఆయన భార్య కిరీటంలో కోహినూర్ వజ్రాన్ని ఉంచారు.తర్వాత వారి కుటుంబంలో వంశపారంపర్యంగా పట్టాభిషేకాల సమయంలో దీనిని ధరిస్తూ వచ్చారు. 2002లో క్వీన్‌ ఎలిజబెత్‌-2 ఈ వజ్రం ఉన్న కిరీటాన్ని ఆఖరిసారి ధరించారు. నాటి నుంచి ఆ కిరీటం టవర్‌ ఆఫ్‌ లండన్‌ సమీపంలోని జువెల్‌ హౌస్‌లో ఉంది. ఈ వజ్రాన్ని ఇవ్వాలని భారత్‌ అనేకమార్లు విజ్ఞప్తి చేసినా బ్రిటన్‌ ప్రభుత్వం తిరస్కరించింది. 800 వందల ఏళ్లలో.. ఎందరో రాజుల వద్దకు చేరి.. ఎన్నో దేశాలు తిరిగిన ఈ కోహినూర్ వజ్రం ప్రస్తుత విలువ సుమారు USD 20 బిలియన్లు అంటే.. ఇండియన్ కరెన్సీ ప్రకారం.. ఈ కోహినూర్ వజ్రం ధర వెల కట్టగలిగిన వారు లేకపోయినా.. దీని విలువ సుమారుగా.. 1.64 లక్షల కోట్ల రూపాయలు ఉండొచ్చని జెమాలజిస్టుల అంచనా. ప్రపంచంలోని సగం దేశాల జీడిపీకి ఇది సమానం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్యాభర్తల కోసం బెస్ట్‌ పోస్టాఫీస్‌ సేవింగ్స్ స్కీమ్‌..! రూ.13 లక్షలు మీ సొంతం

దారుణం.. 13 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి.. ఆ తర్వాత



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *