Kitchen Tips: మీరూ వంట గదిలో గ్యాస్‌ స్టౌ పక్కన వీటిని ఉంచుతున్నారా? ఎంత డేంజరో తెలుసా..

Kitchen Tips: మీరూ వంట గదిలో గ్యాస్‌ స్టౌ పక్కన వీటిని ఉంచుతున్నారా? ఎంత డేంజరో తెలుసా..


ఇప్పుడైతే ప్రతి ఇంట్లో గ్యాస్ స్టౌవ్‌లు ఉన్నాయిగానీ.. గతంలో కట్టెల పొయ్యి మీద అన్ని ఇళ్లల్లో వంట చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గ్యాస్ లేకుండా వంట చేయడం దాదాపు అసాధ్యం అనే పరిస్థితికి వచ్చేశాం. దీంతో అందరూ వంట కోసం గ్యాస్ స్టవ్‌లను ఉపయోగిస్తున్నారు . గ్యాస్ లీకేజీ, మంటలు వచ్చే అవకాశం ఉన్నందున గ్యాస్ స్టవ్‌లపై వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు. దీని గురించి జాగ్రత్తగా ఉండటంతో పాటు, ముఖ్యంగా గ్యాస్ స్టవ్ దగ్గర కొన్ని వస్తువులను అస్సలు ఉంచకూడదని హెచ్చరిస్తున్నారు. నిజానికి, చాలా మంది మహిళలు వంట నూనె నుంచి మసాలా పాత్రల వరకు అన్నీ గ్యాస్ స్టవ్ పక్కనే ఉంచుతుంటారు. ఎందుకంటే ఇది వంటను సులభతరం చేస్తుంది. ఇలా గ్యాస్‌ స్టౌ పక్కనే ఉంచడం వల్ల ఆ వస్తువులకు నష్టం కలిగించడంతోపాటు కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలకు కూడా దారితీసే అవకాశం ఉంది.

గ్యాస్ స్టవ్ దగ్గర ఉంచకూడని వస్తువులు ఇవే..

వంట నూనె

కొంతమంది వంట నూనె డబ్బాను గ్యాస్ స్టవ్ పక్కన ఉంచుతారు. దీనివల్ల వంట చేసేటప్పుడు నూనె వేడెక్కి నాణ్యత క్షీణిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి దానిని గ్యాస్ స్టవ్ పక్కన ఉంచకూడదు.

ప్లాస్టిక్ వస్తువులు

ప్లాస్టిక్ కంటైనర్లు లేదా ఇతర ప్లాస్టిక్ వస్తువులను గ్యాస్ స్టవ్ దగ్గర ఉంచకూడదు. ఎందుకంటే వేడికి ప్లాస్టిక్ కరిగి మంటలు చెలరేగవచ్చు.

ఇవి కూడా చదవండి

సుగంధ ద్రవ్యాలు

చాలా మంది మహిళలు మసాలా దినుసుల డబ్బాను గ్యాస్ స్టవ్ పక్కన ఉంచుతారు. ఎందుకంటే వంట తయారీకి సులభతరం అందుబాటులో ఉంటుందని ఇలా పక్కనే ఉంచుతారు. అలా చేయడం వల్ల సుగంధ ద్రవ్యాల నాణ్యత దెబ్బతింటుంది.

క్లీనర్లు

స్ప్రేలు వంటి క్లీనింగ్ ఉత్పత్తులను గ్యాస్ స్టవ్ దగ్గర ఉంచకూడదు. దీనివల్ల మంటలు చెలరేగవచ్చు. కాబట్టి, మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

విద్యుత్ ఉపకరణాలు

విద్యుత్ ఉపకరణాలను చాలా వేడిగా ఉన్న ప్రదేశాలలో ఉంచకూడదు. ఎందుకంటే అధిక వేడి విద్యుత్ ఉపకరణాలను దెబ్బతీస్తుంది. షార్ట్ సర్క్యూట్లకు కారణమవుతుంది.

మసి బట్టలు

కొంతమంది మసి బట్టలను గ్యాస్ స్టవ్ పక్కనే ఉంచుతారు. దీనివల్ల కొన్నిసార్లు మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. కాబట్టి, బట్టలు గ్యాస్ స్టవ్ పక్కన ఉంచకపోవడమే మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *