Kitchen Hacks: పాత తుప్పు పట్టిన కత్తులను పారేయకండి..! ఇలా క్లీన్ చేసి చూడండి.. కొత్తవాటిలా మెరుస్తాయి..!

Kitchen Hacks: పాత తుప్పు పట్టిన కత్తులను పారేయకండి..! ఇలా క్లీన్ చేసి చూడండి.. కొత్తవాటిలా మెరుస్తాయి..!


ఉల్లిపాయను మనం మామూలుగా వంటల్లో వాడతాం. అయితే ఇది తినడానికే కాదు.. శుభ్రం చేయడానికీ పనికొస్తుందని చాలా మందికి తెలీదు. ఉల్లిపాయలో ఉండే సహజ ఆమ్లాలు, సల్ఫర్ సమ్మేళనాలు తుప్పును కరిగించగలవు. ఉల్లిపాయ ఒక్కటే కాకుండా.. నిమ్మరసం లేదా వెనిగర్ వాడితే ఈ ప్రభావం ఇంకా పెరుగుతుంది.

తుప్పు పట్టిన కత్తులను శుభ్రం చేయడానికి ఒక ప్రభావవంతమైన ఇంటి చిట్కా ఉంది. ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయను సగానికి కట్ చేయండి. ఆపై తుప్పు పట్టిన కత్తికి కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ రాసి ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కతో మెల్లగా రుద్దండి. నిమ్మరసం, వెనిగర్ తుప్పును త్వరగా కరిగించడంలో సహాయపడుతుంది.

తర్వాత మెటల్ స్క్రబ్బర్ లేదా స్టీల్ బ్రష్‌ తో తుప్పు పట్టిన ప్రాంతాన్ని బాగా రుద్దండి. చివరిగా కత్తిని గోరువెచ్చని నీటిలో శుభ్రంగా కడిగి మెత్తటి బట్టతో పూర్తిగా ఆరబెట్టండి. ఈ పద్ధతిని వారానికి ఒకసారి పాటించడం వల్ల కత్తులు పదునుగా ఉండటమే కాకుండా.. తుప్పు పట్టే అవకాశం కూడా తగ్గుతుంది. ఈ చిట్కా కత్తులకే కాకుండా ప్లేట్లు, పాత ఐరన్ సామాగ్రి వంటి వంటింటి వస్తువులకు కూడా వర్తిస్తుంది.

ఈ పద్ధతికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. మన ఇంట్లోనే ఉండే ఉల్లిపాయ, నిమ్మకాయ లేదా వెనిగర్‌ తో తుప్పును దూరం చేయవచ్చు. రసాయనాలు లేకుండా సహజ వస్తువులతో శుభ్రం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానీ ఉండదు. అలర్జీ ఉన్నవారికి కూడా ఇది సురక్షితమైన మార్గం.

కత్తిని తుప్పు పట్టకుండా ఉంచాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. వాడిన వెంటనే శుభ్రం చేయడం, పూర్తిగా ఆరిపోయే వరకు తుడవడం, తడి ప్రదేశాల్లో ఉంచకపోవడం ముఖ్యమైనవి. అలాగే కొన్ని చుక్కల నూనెను అప్పుడప్పుడు కత్తిపై రాస్తే తుప్పు రావడం తగ్గుతుంది. ఇంట్లో తుప్పు పట్టిన కత్తులు, పాత వస్తువులు పారేయకుండా.. ఈ చిన్న చిట్కాతో కొత్తవాటిలా చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *