Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్‌ల కుమారుడిని చూశారా? ఎంత క్యూట్ గా ఉన్నాడో! వీడియో ఇదిగో..

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్‌ల కుమారుడిని చూశారా? ఎంత క్యూట్ గా ఉన్నాడో! వీడియో ఇదిగో..


ఈ మధ్యన సినిమా హీరోలు, హీరోయిన్లు తమ పిల్లలను బయటకు చూపించడం లేదు. విరాట్ కోహ్లీ- అనుష్క మొదలుకొని రామ్ చరణ్- ఉపాసన వరకు హీరో తమ బిడ్డల ఫొటోలు, వీడియోలను ఎవరి కంట పడకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇప్పుడీ జాబితాలో మరో టాలీవుడ్ జంట చేరిపోయింది. హీరో, హీరోయిన్లు కిరణ్ అబ్బవరం- రహస్య గోరఖ్ లు ఈ మధ్యనే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 22న ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది రహస్య. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా పంచుకుని మురిసిపోయాడు హీరో కిరణ్ అబ్బవరం. హనుమాన్ జయంతి రోజున తమ ఇంట్లోకి బిడ్డ అడుగు పెట్టాడని ఉబ్బితబ్బిబ్బైపోయాడు. అయితే తన కుమారుడి ఫొటోలను మాత్రం ఎవరికీ చూపించలేదీ యంగ్ హీరో. తన కొడుకు పాదాలను ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో కిరణ్ అబ్బవరం కుమారుడు ఎలా ఉన్నాడో చూద్దామని పరితపించిన వాళ్లకు నిరాశే ఎదురైంది. తాజాగా కిరణ్ అబ్బవరం- రహస్య దంపతులు సోషల్ మీడియాలో ఒక క్యూట్ వీడియోను షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తమ కుమారుడితో మొదటి ఫొటో షూట్ నిర్వహించారీ లవ్లీ కపుల్. దీనినే ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి ‘‘మా ఇటీవలి జీవితం. నా కొడుకు మొదటి ఫొటోషూట్’ అని క్రేజీ క్యాప్షన్ రాసుకొచ్చాడు కిరణ్ దంపతులు. అయితే ఇందులో తమ కుమారుడి ఫేస్ కనిపించకుండా ఎమోజీలతో షేర్ చేశాడు. అయితే ఈ వీడియో మాత్రం చాలా క్యూట్ గా ఉంది. నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

కిరణ్ అబ్బవరం- రహస్య గోరఖ్ లది ప్రేమ వివాహం. తమ మొదటి చిత్రం రాజా వారు రాణి వారు సినిమా షూటింగ్ లోనే వీరు ప్రేమలో పడ్డారు. చాలా ఏళ్లు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2024 లో పెద్దల అనుమతితో పెళ్లి పీటలెక్కారు. ఇక ఈ ఏడాది హనుమాన్ జయంతి రోజున రహస్య ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. క సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు కిరణ్ అబ్బవరం. అయితే ఆ తర్వాత చేసిన దిల్ రుబా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం కే- ర్యాంప్ అనే సినిమాలో నటిస్తున్నాడు కిరణ్. ఈ సినిమాలో అందాల భామ యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తుండగా జెయిన్స్ నాని డైరెక్ట్ చేస్తున్నారు. రాజేష్ దండ, శివ బొమ్మక్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *