Kingdom Collections Day 3: వీకెండ్‏లో కింగ్‏డమ్ దూకుడు.. 3 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే..

Kingdom Collections Day 3: వీకెండ్‏లో కింగ్‏డమ్ దూకుడు.. 3 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే..


టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుపోతుంది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ స్పై గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాకు మొదటి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. భారీ అంచనాల మధ్య జూలై 31న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుంది. అలాగే మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు విజయ్ కెరీర్ లోనే ఓపెనింగ్ రోజునే భారీ వసూల్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇక ఆ తర్వాత రోజు సైతం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. మొదటి రోజు రూ.39 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం రెండు రోజులకు గానూ రూ.53 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్రయూనిట్ తెలిపింది.

తాజాగా కింగ్డమ్ మూవీ మూడు రోజుల కలెక్షన్స్ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.67 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమాకు 53 కోట్ల వరుక థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఆదివారంతోపాటు వచ్చే వారం సైతం కింగ్డమ్ వసూళ్లు మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రంలో విజయ్ మాస్ యాక్షన్ అదరగొట్టారు. ఇక ఇందులో విజయ్ , సత్యదేవ్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ అందించిన బీజీఎమ్ సినిమాకు హైలెట్ అయ్యింది. ఈ చిత్రంలో విజయ్ జోడిగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించి సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి: Serial Actress: తస్సాదియ్యా అమ్మడు.. సీరియల్స్ మానేసింది.. ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది..

Cinema: ఏం సినిమా రా బాబూ.. ఏకంగా 17400 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *