Kingdom: కింగడమ్‌ హిట్‌తో ఫుల్ జోష్‌లో విజయ్‌ దేవరకొండ.. లైన్‌లో అరడజను సినిమాలు.. అందరూ బడా డైరెక్టర్లే

Kingdom: కింగడమ్‌ హిట్‌తో ఫుల్ జోష్‌లో విజయ్‌ దేవరకొండ.. లైన్‌లో అరడజను సినిమాలు.. అందరూ బడా డైరెక్టర్లే


టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమా బాక్సాఫీస్ భారీ వసూళ్లు సాధిస్తోంది. గత శుక్రవారం (జులై 31న) రిలీజైన ఈ స్పై గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజు రూ.39 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన కింగ్ డమ్ ఆ తర్వాత రెండు రోజులకు గానూ రూ.53 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.67 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు అధికారికంగా వెల్లడించార మేకర్స్. ఆదివారం వీకెండ్ తో పాటు కింగ్ డమ్ వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కింగ్ డమ్ భారీ విజయంతో హీరో దేవరకొండతో పాటు చిత్ర సభ్యులందరూ ఫుల్ జోష్ లో ఉంటున్నారు. మరిన్ని ప్రమోషన్లు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే కింగ్ డమ్ తర్వాత విజయ్ దేవరకొండ ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం విజయ్ డైరీలో అరడజను సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. పైగా ఈ లిస్టులో అందరూ స్టార్ డైరెక్టర్లే ఉన్నారని టాక్.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ప్రముఖ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. గతంలో వీరి కాంబోలో వచ్చిన ట్యాక్సీవాలా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు ఈ క్రేజీ కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దీని తర్వాత దిల్ రాజు బ్యానర్ లో రౌడీ జనార్దన్ అనే సినిమాకు కమిట్ అయ్యాడీ రౌడీ హీరో. వి.కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకుడు. వీటి తర్వాత స్టార్ డైరెక్టర్లు సుకుమార్, సందీప్ రెడ్డి వంగా లతో కూడా విజయ్ సినిమాలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే కింగడమ్ సినిమాకు పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉంటాయని చెబుతున్నారు. మొత్తానికి ఇప్పుడు అందరూ స్టార్ డైరెక్టర్లను లైన్ లో పెట్టాడు రౌడీ హీరో.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *