ఇండస్ట్రీలో అందం అభినయం ఉన్నా అదృష్టం లేని భామ ఎవరు అంటే ముందు వరసలో కనిపించే పేరు కేతిక శర్మ. . బోలెడంత అందం ఉన్నా అదృష్టం లేని చిన్నది ఈ అమ్మడు. రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కేతిక శర్మ.
తొలి సినిమాలోనే రొమాంటిక్ సీన్స్ లో దుమ్మురేపింది. ఆకాష్ పూరి హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆతర్వాత లక్ష్య అనే సినిమా చేసింది కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. కానీ ఈ అమ్మడికి ఆఫర్స్ ఆగలేదు.
వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా, అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన బ్రో సినిమాలో చేసింది. కానీ ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. మొన్నామధ్య సింగిల్ అనే సినిమా చేసింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన సింగిల్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాతో కేతిక అకౌంట్ లో మొదటి హిట్ పడింది. కానీ ఈ అమ్మడి ఆతర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. నితిన్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. అందంతో కవ్విస్తున్నా ఈ చిన్నదానికి మాత్రం ఆఫర్స్ రావడం లేదు.. ప్రస్తుతం కొత్త సినిమా ఏది అనౌన్స్ చేయలేదు కేతిక.
ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం కేతిక చేతిలో సినిమాలు ఏవి లేవు. కానీ సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడి ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది.




