KCR: ఇవాళ సిట్‌ ముందుకు మాజీ సీఎం కేసీఆర్‌.. నిరసనలకు బీఆర్‌ఎస్‌ పిలుపు

KCR: ఇవాళ సిట్‌ ముందుకు మాజీ సీఎం కేసీఆర్‌.. నిరసనలకు బీఆర్‌ఎస్‌ పిలుపు


సిట్‌ అధికారుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు కేసీఆర్‌. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులకు 6 పేజీల లేఖ రాశారు. సెక్షన్‌ 160 ప్రకారం తాను జూబ్లీహిల్స్ పీఎస్‌ పరిధిలో లేనన్నారు. అసలు, తనకు నోటీసులిచ్చే అధికారం వారికి లేదన్నారు. అఫిడవిట్‌లోని చిరునామాతో సంబంధం లేదని.. నోటీసు ఇచ్చే సమయంలో వాస్తవ నివాసమే ప్రాముఖ్యమని లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం తన నివాసం ఎర్రవల్లి అన్నారు కేసీఆర్‌. ఇంటి గోడలపై నోటీసులు అంటించడం సరికాదన్నారు కేసీఆర్. ఇది తన గౌరవానికి భంగం కలిగించడమే అన్నారు. ఇందుకు సంబంధించిన పలు కేసుల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులు, ఉత్తర్వులను కేసీఆర్ లేఖలో ప్రస్తావించారు. హరీష్‌రావు అఫిడవిట్‌లో సిద్దిపేట అడ్రస్‌ ఉందని.. కానీ హైదరాబాద్‌లో నోటీసులు ఇచ్చారని గుర్తుచేశారు. ఇది పోలీసుల ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.

సిట్‌ తీరుపై చట్టపరమైన అభ్యంతరాలున్నా విచారణకు సహకరిస్తానన్నారు కేసీఆర్. సిట్‌ కోరినట్టే.. నందినగర్‌ నివాసంలో సిట్ విచారణకు హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు. మొదటిసారి, గతనెల 29న నోటీసులిచ్చిన సిట్‌.. తర్వాతి రోజే అంటే జనవరి 30న విచారణకు హాజరుకావాలని కోరింది. అయితే, ఆరోజు రాలేనని, మరో తేదీ నిర్ణయించాలని.. అలాగే ఎర్రవల్లి ఫాంహౌస్‌లో విచారించాలని సిట్‌ను కోరారు కేసీఆర్‌. 65 ఏళ్లు పైబడిన వాళ్లు ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారించాలన్న నిబంధనను కేసీఆర్‌ ప్రస్తావించారు. కానీ, ఎర్రవల్లిలో విచారించాలన్న కేసీఆర్‌ను విజ్ఞప్తిని తోసిపుచ్చింది సిట్‌. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విచారించేందుకు సాంకేతికంగా వీలుపడదని తేల్చిచెప్పింది. రికార్డుల్లో ఫామ్‌హౌస్‌ అడ్రస్‌ లేనందున.. అక్కడ విచారించలేమంది సిట్‌. అంతేకాదు, గతనెల 30న రెండోసారి నోటీసులిచ్చిన సిట్‌.. ఇవాళ హైదరాబాద్‌ నందినగర్‌లోని నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలని కోరింది. అయితే, రెండుసార్లు కూడా ఇంటి గోడలకు నోటీసులు అంటించడంపై అభ్యంతరం చెప్పారు కేసీఆర్‌. సిట్‌ తీరుపై చట్టపరమైన అభ్యంతరాలున్నా విచారణకు సహకరిస్తానన్నారు కేసీఆర్.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *