Kavya Maran: కావ్య పాపకు భారీ లాభాలు తెచ్చిపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. కానీ అక్కడ మాత్రం నష్టాలే..

Kavya Maran: కావ్య పాపకు భారీ లాభాలు తెచ్చిపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. కానీ అక్కడ మాత్రం నష్టాలే..


కావ్య మారన్.. పరిచయం అక్కర్లేని పేరు. ఐపీఎల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో.. కావ్యా పాప రియాక్షన్స్‌కు సైతం అంతే క్రేజ్ ఉంటుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి స్టార్లు ఈ జట్టులో భాగం. అయితే కావ్యా పాప కంపెనీల ఆదాయం గురించి తెలుసుకోవాలని మీకు ఎప్పుడైన అనిపించిందా..? తాజాగా సన్ టీవీ నెట్‌వర్క్ మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ప్రత్యేక విషయం ఏమిటంటే.. కావ్య మారన్ మీడియా కంపెనీ నికర లాభంలో 5 శాతానికి పైగా నష్టాన్ని చవిచూసింది. అదే సమయంలో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 473 కోట్లకు పైగా లాభాలను ఆర్జించింది.

త్రైమాసిక ఫలితాలు ఇలా..

జూన్ 30, 2025 తో ముగిసిన మొదటి త్రైమాసికంలో సన్ టీవీ నెట్‌వర్క్ లిమిటెడ్ నికర లాభం 5.38 శాతం తగ్గి రూ.529.21 కోట్లుగా ఉంది. గత ఏడాది ఏప్రిల్-జూన్ కాలంలో కంపెనీ నికర లాభం రూ.559.32 కోట్లుగా నమోదైంది. జూన్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 1.77 శాతం తగ్గి రూ.1,290.28 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.1,313.55 కోట్లుగా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో సన్ టీవీ నెట్‌వర్క్ మొత్తం వ్యయం 10 శాతం పెరిగి రూ.782 కోట్లకు చేరుకుంది. అయితే ఇతర ఆదాయాలతో సహా సన్ టీవీ నెట్‌వర్క్ మొత్తం ఆదాయం జూన్ త్రైమాసికంలో 1.28 శాతం పెరిగి రూ.1,479.19 కోట్లకు చేరుకుంది.

క్రికెట్ నుండి ఎంత ఆదాయం..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ ఫ్రాంచైజీ, క్రికెట్ దక్షిణాఫ్రికా T20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టును కూడా సన్ టీవీ కలిగి ఉంది. జూన్ 30, 2025తో ముగిసిన త్రైమాసిక ఫలితాలలో హోల్డింగ్ కంపెనీ క్రికెట్ ఫ్రాంచైజీల నుండి రూ. 473.03 కోట్ల ఆదాయం, రూ. 256.09 కోట్ల ఖర్చు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అదనంగా జూన్ 30, 2025తో ముగిసిన త్రైమాసికం తరువాత హోల్డింగ్ కంపెనీ నార్తర్న్ సూపర్‌చార్జర్స్ లిమిటెడ్‌లో 100 శాతం ఈక్విటీని కొనుగోలు చేయడానికి.. ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డుతో సుమారు రూ. 1,050 కోట్లతో వాటా కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. సన్ టీవీ నెట్‌వర్క్ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ, మరాఠీ సహా ఏడు భాషలలో శాటిలైట్ ఛానెల్స్‌ను కలిగి ఉంది. దేశం మొత్తం ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్‌లు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *