పైన ఫోటోలో కమల్ హాసన్ ఎదురుగా ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..? ఒకప్పుడు తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలతో చక్రం తిప్పిన హీరోయిన్. బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత కథానాయికగా సౌత్ ఇండస్ట్రీని ఏలేసింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఆమె చేసిన ఒకటి రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. అప్పట్లో గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే అగ్ర స్థానంలో దూసుకుపోయిన ఈ హీరోయిన్.. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవలే కమల్ హాసన్ తో ఆమె నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. కానీ అందులో కమల్ తో ఆమె చేసిన లిప్ లాక్ సీన్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అవును.. ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె పేరు అభిరామి. అసలు పేరు దివ్య గోపీ కుమార్.
ఇవి కూడా చదవండి: Serial Actress: తస్సాదియ్యా అమ్మడు.. సీరియల్స్ మానేసింది.. ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది..
ఇవి కూడా చదవండి
కేరళలోని త్రివేండ్రంలో జన్మించిన ఆమె.. 1995లో కథాపురుషన్ సినిమాతో మలయాళీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో వరుస అవకాశాలు అందుకుంది. దివంగత నటుడు శ్రీహరి హీరోగా నటించిన థాంక్యూ సుబ్బారావ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత చార్మినార్ అనే సినిమాలో కనిపించింది. కానీ వేణు తొట్టెంపూడి జోడిగా చెప్పవే చిరుగాలి సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ఆమె నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు.
Cinema: ఏం సినిమా రా బాబూ.. ఏకంగా 17400 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్..
కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన అభిరామి..కొన్నాళ్లకే రీఎంట్రీ ఇచ్చింది. ఎక్కువగా తమిళం, కన్నడ భాషలలో నటించిన ఆమె.. ఇప్పుడిప్పుడే తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇటీవల కమల్ హాసన్, డైరెక్టర్ మణిరత్నం కాంబోలో వచ్చిన థగ్ లైఫ్ చిత్రంలో నటించింది. ఇందులో త్రిష కథానాయికగా నటించగా.. అభిరామి కీలకపాత్ర పోషించింది. ఈ సినిమాలో కమన్, అభిరామికి మధ్య వచ్చిన లిప్ లాక్ సీన్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
Actress : ఒక్క సినిమాతో ఫేమస్.. ముద్దు సీన్ అనగానే గుక్కపెట్టి ఏడ్చేసింది.. దెబ్బకు ఆఫర్స్ గోవిందా..
ఇవి కూడా చదవండి: Tollywood: పొలిటికల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. టాలీవుడ్లో క్రేజీ హీరో.. ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే..