Kaleshwaram Project: కాళేశ్వరం డ్యామేజ్‌కి బాధ్యులు వాళ్లే.. తేల్చేసిన కమిషన్.. కేబినెట్ భేటీపై ఉత్కంఠ..

Kaleshwaram Project: కాళేశ్వరం డ్యామేజ్‌కి బాధ్యులు వాళ్లే.. తేల్చేసిన కమిషన్.. కేబినెట్ భేటీపై ఉత్కంఠ..


కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ కేబినెట్ సోమవారం చర్చించనుంది. కాళేశ్వరం అవకతవకలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ 700కు పైగా పేజీల నివేదికలోని అంశాలను క్లుప్తంగా కేబినెట్​కు నివేదించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఆనకట్టల ప్రణాళిక మొదలు నిర్మాణం, నిర్వహణ వరకు జరిగిన లోపాలను కమిషన్ దానిలో వివరించింది. ప్రజాధనం దుర్వినియోగం, అందుకు బాధ్యులైన వారి పేర్లను కూడా ప్రస్తావించింది. కాళేశ్వరం డ్యామేజ్‌కి బాధ్యులెవరో కమిషన్ తేల్చిన నేపథ్యంలో.. తెలంగాణ కేబినెట్ భేటీపై ఉత్కంఠ కొనసాగుతోంది.. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందనేది తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

లైవ్ వీడియో చూడండి..



కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చులను కూడా కమిషన్‌ తన నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌కు 38,500 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తే, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయాన్ని 71, 436 కోట్ల రూపాయలగా ప్రకటించారని చెబుతూ, దీనికి సంబంధించి- 2016లో నాటి ముఖ్యమంత్రి రాసిన లేఖను కమిషన్‌ ప్రస్తావించింది. ఇక ఇదే ప్రాజెక్టుకు 2022 మార్చికల్లా లక్షా 10వేల 248 కోట్ల 48 లక్షల రూపాయల పరిపాలనపరమైన అనుమతులు లభించాయని కమిషన్‌ వివరించింది.

మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకున్నా, ఏజెన్సీకి రెండు సర్టిఫికెట్లు ఇచ్చారనీ, ఇది పూర్తిగా తప్పిదమేనని, చట్టవిరుద్ధమని కమిషన్‌ తప్పుబట్టింది. మేడిగడ్డకు 2019 సెప్టెంబర్‌9న ఇచ్చిన కన్‌స్ట్రక్షన్‌ కంప్లీషన్‌ సర్టిఫికెట్‌, అలాగే 2021 మార్చి 15న ఇచ్చిన సర్టిఫికెట్‌ ఆఫ్‌ కంప్లీషన్‌ ఆఫ్‌ వర్క్స్‌ ఇవ్వడం కూడా తప్పేనని కమిషన్‌ తన నివేదికలో తెలిపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *