లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కాజల్.. తొలి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత చందమామ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తెలుగులో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాగ చైతన్య వంటి స్టార్ హీరోలతో ఎన్నో హిట్స్ చేసింది ఈ అమ్మడు.