Kaal Sarp Yoga: కాలసర్ప యోగం.. ఆర్థిక విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త!

Kaal Sarp Yoga: కాలసర్ప యోగం.. ఆర్థిక విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త!


ఈ నెల (ఫిబ్రవరి) 23 నుంచి మార్చి 4వ తేదీ వరకు గ్రహ సంచారంలో కాలసర్ప దోషం ఏర్పడబోతోంది. గ్రహాలన్నీ రాహు కేతువుల మధ్య సంచారం చేయడాన్నే జ్యోతిషశాస్త్రంలో కాలసర్ప దోషంగా పరిగణిస్తారు. రాహువును విష సర్పానికి తలగానూ, కేతువును తోకగానూ గుర్తించడం జరిగింది. ఈ కాలసర్ప యోగం వల్ల ఆర్థిక నష్టాలు, ఆర్థిక మోసాలు, ఆశాభంగాలు, నిరాశా నిస్పృహలు, నమ్మకద్రోహాలు, అర్థం కాని అనారోగ్యాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభం, మీన రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీరు కొద్ది రోజుల పాటు సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం, రాహుకేతువులకు పూజ చేయించడం మంచిది.

  1. కర్కాటకం: అష్టమ, ద్వితీయ స్థానాల్లో ఏర్పడిన ఈ కాలసర్ప దోషం వల్ల ఈ రాశివారు దగ్గర బంధువులు, బాగా సన్నిహితుల చేతుల్లో మోసపోయే లేదా నష్టపోయే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో బంధుమిత్రులకు ప్రమేయం కల్పించకపోవడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగక ఇబ్బంది పడతారు. పిల్లలు చదువుల్లో వెనుకబడే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణులు కాకపోవచ్చు. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది.
  2. సింహం: ఈ రాశిలో కాలసర్ప దోషం ఏర్పడుతున్నందువల్ల రోగ నిర్ధారణ చేయలేని అనారోగ్యాలు పీడించే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో మోసపోయే అవకాశం ఉంది. మిత్రుల్లో కొందరు శత్రువులుగా మారడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎదురవుతాయి. పెళ్లి సంబంధాలు చివరి క్షణంలో వెనక్కుపోతాయి. జీవిత భాగస్వామి అనారోగ్యంతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులకు ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.
  3. వృశ్చికం: ఈ రాశికి చతుర్థ స్థానంలో, అంటే సుఖ సంతోషాలకు సంబంధించిన స్థానంలో కాలసర్ప దోషం ఏర్పడడం వల్ల కుటుంబ సౌఖ్యం బాగా తగ్గుతుంది. మనశ్శాంతి ఉండకపోవచ్చు. ఇంటా బయటా కూడా మీకు ఇష్టం లేని పనులు ఎక్కువగా జరుగుతాయి. దుర్వార్తలు ఎక్కువగా వింటారు. ఆర్థిక ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆస్తి, గృహ, వాహన సమస్యలు విజృంభిస్తాయి. అనారోగ్యానికి అవకాశం ఉంది.
  4. కుంభం: ఈ రాశిలో కాలసర్ప దోషం ఏర్పడుతున్నందువల్ల ఆర్థిక విషయాలకు సంబంధించినంత వరకూ బంధుమిత్రులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆర్థికంగా బాగా దెబ్బతినే అవకాశం ఉంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. మీ స్థలాలు, భూములు కబ్జా అయ్యే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒకపట్టాన ముందుకు సాగకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగంలో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతాయి. శత్రువుల సంఖ్య పెరుగుతుంది.
  5. మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో కాలసర్ప దోషం ఏర్పడడం వల్ల ఆర్థికంగా మోసపోవడం, నష్టపోవడం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువగా ఉంటుంది. అవమానాలు, అపనిందలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. రహస్య శత్రువులు తయారవుతారు. ఉద్యోగంలో సహోద్యోగుల్లో కొందరు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు ఎక్కువవుతారు. ఆస్తి వివాదాలు, ఆర్థిక వ్యవహారాల్లో బాగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *