Jr.NTR: లుక్కు అదిరిపోయింది.. ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ పై ఎన్టీఆర్.. మొట్ట మొదటి హీరో..

Jr.NTR: లుక్కు అదిరిపోయింది.. ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ పై ఎన్టీఆర్.. మొట్ట మొదటి హీరో..


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. చిన్న వయసులోనే హీరోగా తెరంగేట్రం చేసిన తారక్.. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తారక్.. ఇప్పుడు వార్2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 14న అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో బీటౌన్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్, ట్రైలర్ మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Tollywood: పొలిటికల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. టాలీవుడ్‏లో క్రేజీ హీరో.. ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే..

ఇదిలా ఉంటే.. కొద్ది రోజులుగా వార్ 2 ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ కవర్ పేజీపై ఎన్టీఆర్ ఫోటో ప్రింట్ అయ్యింది. అందులో రాయల్ లుక్ లో ఎన్టీఆర్ స్వాగ్ అదిరిపోయింది. దీంతో ఇప్పుడు ఈ మ్యాగజైన్ కవర్ పేజీ సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. మెరూన్ కలర్ షార్వానిలో స్టైలీష్ గా కూర్చుని ఫోటోలకు ఫోజులిచ్చారు తారక్. ఈ కవర్ పేజీ ఫోటోషూట్ దుబాయ్ లో జరిగినట్లు తెలుస్తోంది. తారక్ ఫోటోలను షేర్ చేస్తూ.. “ఫ్రమ్ టీన్ ప్రాడిజీ టు పాన్-ఇండియా పవర్‌హౌస్”గా మారిన తారక్ అంటూ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి: Serial Actress: తస్సాదియ్యా అమ్మడు.. సీరియల్స్ మానేసింది.. ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది..

ప్రస్తుతం వార్ 2 ప్రమోషన్లలో పాల్గొంటున్న తారక్.. మరోవైపు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా.. మాస్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రాబోతుంది.

ఇవి కూడా చదవండి: Serial Actress: తస్సాదియ్యా అమ్మడు.. సీరియల్స్ మానేసింది.. ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది..

ఇవి కూడా చదవండి:

Cinema: ఏం సినిమా రా బాబూ.. ఏకంగా 17400 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్..

Actress : ఒక్క సినిమాతో ఫేమస్.. ముద్దు సీన్ అనగానే గుక్కపెట్టి ఏడ్చేసింది.. దెబ్బకు ఆఫర్స్ గోవిం





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *