Jr.NTR: ఎన్టీఆర్ సినిమాను మూడుసార్లు రిజెక్ట్ చేసిన ఏకైక హీరోయిన్.. ఎందుకో తెలుసా..?

Jr.NTR: ఎన్టీఆర్ సినిమాను మూడుసార్లు రిజెక్ట్ చేసిన ఏకైక హీరోయిన్.. ఎందుకో తెలుసా..?


యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోలలో ఆయన ఒకరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అయనకు వరల్డ్ వైడ్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. దీంతో ఇప్పుడు ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇవే కాకుండా మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 షూటింగ్ సైతం త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తారక్ అప్ కమింగ్ మూవీస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్ సరసన నటించాలని చాలా మంది హీరోయిన్స్ అనుకుంటారు. తారక్ సరసన నటించే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోరు. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత బాలీవుడ్ హీరోయిన్స్ సైతం తారక్ జోడిగా కనిపించాలని కోరుకుంటున్నారు. కానీ మీకు తెలుసా.. ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ వస్తే.. ఓ హీరోయిన్ ఏకంగా మూడుసార్లు రిజెక్ట్ చేసిందట. ఆమె మరెవరో కాదు.. బీటౌన్ బ్యూటీ అలియా భట్. ఆమెకు మూడుసార్లు ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ వస్తే.. పలు కారణాలతో ఆ అవకాశాన్ని వదిలేసుకుందట.

ఇవి కూడా చదవండి

వీరిద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించారు. కానీ అందులో రామ్ చరణ్ జోడిగా కనిపించింది. అయితే దేవర సినిమాలో తారక్ జోడిగా అలియా నటించాల్సి ఉందని.. కానీ అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఆ ఛాన్స్ కోల్పోయిందట. ఆ తర్వాత మరోసారి తారక్ సినిమా కోసం సంప్రదించగా.. మరో సినిమాతో బిజీగా ఉండడంతో వీలు కాలేదట. అలా వివిధ కారణాలతో ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ మూడు సార్లు కోల్పోయింది. దేవర చిత్రంలో ఎన్టీఆర్ జోడిగా జాన్వీ కపూర్ కనిపించింది.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *