Jr NTR: ఎన్టీఆర్‌పై వార్ 2 ఎఫెక్ట్.. ఆ మాత్రం ఉంటుందిలే

Jr NTR: ఎన్టీఆర్‌పై వార్ 2 ఎఫెక్ట్.. ఆ మాత్రం ఉంటుందిలే


కొన్నిసార్లు ఫ్లాప్స్ కూడా మంచే చేస్తుంటాయి.. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఇదే జరుగుతుంది. పదేళ్లుగా అప్రతిహత జైత్రయాత్ర చేస్తున్న ఈయనకు.. వార్ 2తో బ్రేకులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత ఆయన ఆలోచనల్లో కూడా మార్పులు భారీగానే వచ్చాయి. సెట్స్‌పై ఉన్న.. త్వరలో రాబోయే సినిమాలకు ఇది అప్లై అవుతుంది. ఇంతకీ తారక్ ఏం చేస్తున్నారు..? పదేళ్లుగా ఫ్లాప్ అంటూ లేకుండా సాగుతున్న తారక్‌కు బ్రేకులు వేసిన సినిమా వార్ 2. రాజమౌళి శాపాన్ని కూడా దేవరతో అధిగమించి కొత్త ట్రెండ్ సెట్ చేసిన తారక్.. బాలీవుడ్ దర్శకుడికి దొరికిపోయారు. మనది కాని కథలో.. మ్యాజిక్ చేయబోయి చేతులు కాల్చుకున్నారు యంగ్ టైగర్. కానీ వార్ 2 ఫలితం ఈ హీరోకు చెడు కంటే మేలే ఎక్కువ చేసింది. వార్ 2 ఫ్లాప్ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటి వరకు షూటింగ్ చేసిన ఔట్ కమ్ మళ్లీమళ్లీ చూసుకుంటున్నారు. కావాల్సినంత టైం తీసుకుని మరీ షూట్ చేస్తున్నారు. ఈ విషయంలో నీల్ కూడా తారక్‌కు ఫుల్ సపోర్ట్‌గా ఉన్నారు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా వస్తుంది. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేయడానికి చూస్తున్నారు. నిజానికి నీల్ సినిమా టీజర్ ఎప్పుడో రావాల్సి ఉంది.. కానీ పర్ఫెక్షన్ కోసం టైమ్ తీసుకుంటున్నారు టీం. దీనికోసం మేకోవర్ బాగా అయ్యారు తారక్. ఆయన లుక్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. సన్నగా కరెంట్ తీగలా మారి.. యంగదొంగ, కంత్రీ రోజుల్ని గుర్తు చేస్తున్నారు తారక్. ప్రశాంత్ నీల్ సినిమానే కాదు.. దేవర 2 స్క్రిప్ట్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉన్నారు ఎన్టీఆర్. పార్ట్ 1 హిట్టైనా.. కంటెంట్ విషయంలో విమర్శలు తప్పలేదు. అందుకే పార్ట్ 2 స్క్రిప్ట్‌పై ఇంకాస్త కేర్ పెరిగింది. మొత్తానికి వార్ 2 తర్వాత తారక్‌తో ఓ కథకు ఓకే చెప్పించడం దర్శకులకు పెద్ద టాస్క్‌లా మారింది. ఇది కూడా మంచిదే అంటున్నారు ఫ్యాన్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Musi River: మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు

Gold & Silver Price: తగ్గిన బంగారం వెండి ధరలు.. ఎంతంటే ??

Raashii Khanna: సినిమా ఛాన్స్ లేకపోతే ఏంటి.. నాకు సోషల్ మీడియా ఉందిగా అంటున్న రాశీ ఖన్నా

గోల్డెన్ ఛాన్స్.. చేతులారా నాశనం చేసుకున్నారుగా

Ranveer Singh: చిక్కుల్లో ధురంధర్ స్టార్‌.. రణవీర్‌ సింగ్‌ కు షాక్ ఇచ్చిన నిర్మాతలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *