Jasprit Bumrah: ఇంగ్లాండ్‌లో స్పెషల్‌ వాటర్‌ తాగుతున్న బుమ్రా..! ఆ నీటి ప్రత్యేకత ఏంటి? అవే ఎందుకు తాగాలి? పూర్తి వివరాలు

Jasprit Bumrah: ఇంగ్లాండ్‌లో స్పెషల్‌ వాటర్‌ తాగుతున్న బుమ్రా..! ఆ నీటి ప్రత్యేకత ఏంటి? అవే ఎందుకు తాగాలి? పూర్తి వివరాలు


ఇప్పటివరకు టీమిండియాలో విరాట్ కోహ్లీ ఒక్కడే కాస్ట్లీ వాటర్‌ తాగుతాడని మాత్రమే మనం విన్నాం. కానీ, ఇప్పుడు దానికి జస్ప్రీత్ బుమ్రా కూడా ప్రత్యేకమైన నీరు తాగుతున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో బుమ్రా ఈ ప్రత్యేకమైన నీళ్లు తాగుతూ కనిపించాడు. లీడ్స్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా బుమ్రా ఆ నీళ్లు తాగుతూ కనిపించాడు. బుమ్రా తాగుతున్న నీళ్లకు ప్రత్యేకత ఉంది. ఆ నీళ్లు తాగడం వల్ల 3 ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

బుమ్రా తాగే నీటి ప్రత్యేకత..!

లీడ్స్ టెస్ట్ సమయంలో బుమ్రా తాగుతున్న నీటిని ఒక ఇంగ్లీష్ కంపెనీ తయారు చేసింది. సాధారణంగా ఆటగాళ్ళు ఎక్కువ వ్యాయామం చేసినప్పుడు, ఎక్కువ శ్రమించినప్పుడు లేదా అలసిపోయినప్పుడు లేదా వారి శరీరం వాపుకు గురైనప్పుడు ఈ నీటిని తాగుతారు. అటువంటి పరిస్థితులలో ఆటగాళ్ళు pH విలువ 7 కంటే ఎక్కువ ఉన్న నీటిని తాగేందుకు ఇష్టపడతారు. లీడ్స్ టెస్ట్ సమయంలో బుమ్రా తాగిన నీటి ప్రత్యేకత ఏమిటంటే దాని pH విలువ తటస్థంగా ఉంటుంది.

3 ప్రయోజనాలు..!

ఈ నీటిని తాగడం వల్ల 3 ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది.. ఈ రకమైన ఆల్కలీన్ నీటిని తాగడం వల్ల ఆమ్లత్వం తగ్గుతుంది. రెండవది.. అలసట ఉండదు. మూడవది.. శరీరం వేగంగా కోలుకుంటుంది. ఈ 3 కారణాల వల్లనే ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బుమ్రా ఈ స్పెషల్‌ ఆల్కలీన్‌ వాటర్‌ తాగుతున్నాడు.

బుమ్రాకే ఎందుకు?

బుమ్రాకు ఆ నీరు అవసరం. అతని పనిభారం అతని శరీరంపై పెద్దగా ప్రభావం చూపకుండా ఉండేందుకు ఇది ఎంతో సహాయపడుతుంది. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో బుమ్రా టీమిండియాకు ఎంతో కీలక ఆటగాడు. అటువంటి పరిస్థితిలో, గాయం, అలసట నుండి అతన్ని సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం. బుమ్రాను ఫిట్‌గా ఉంచేందుకు భారత జట్టు యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒకటి. అతనికి pH విలువ 7 కంటే ఎక్కువ ఉన్న ఆ ప్రత్యేక నీటిని తాగడానికి ఇస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *