అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. దఢక్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.మొన్నటివరకు హిందీలో వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ బ్యూటీ. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లొనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతుంది ఈ చిన్నది. ఇక గత ఏడాది ఎన్టీఆర్ కు జోడీగా దేవర సినిమాలో నటించింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది జాన్వీ. త్వరలోనే దేవర 2 రానుంది.
అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన కూడా నటిస్తుంది జాన్వీ కపూర్. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో జాన్వీ పల్లెటూరి అమ్మాయిలా కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇక సోషల్ మీడియాలో జాన్వీ అందాలకు యమా క్రేజ్ ఉంది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ చిన్నది. కాగా జాన్వీ వయసు ఇప్పుడు 28 ఏళ్ళు కానీ కోట్ల ఆస్తిని సంపాదించింది. తల్లి స్టార్ హీరోయిన్, తండ్రి బడా నిర్మాత అయినా కూడా జాన్వీ సొంతంగా సంపాదిస్తూ కోట్లు కూడబెట్టింది.
ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది జాన్వీ. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.