ధడక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది.
తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. రెడ్ బ్రైడల్ లుక్‌లో మెరిసింది. ప్రముఖ డిజైనర్ మసాబా రూపొందించిన ఈ లెహంగాలో జాన్వీ ఫోటోషూట్‌లో పాల్గొంది.
ఎర్ర రంగు, గోల్డ్ ఎంబ్రాయిడరీతో కూడిన బ్రైడల్ లెహంగా, దీపం వంటి నెక్లైన్ కలిగిన బ్లౌజ్, పెద్ద స్కర్ట్ వోరు లుక్స్‌ను మరింత అందంగా మార్చాయి. మొత్తానికి అందులో సంప్రదాయ రాజకుమారిలా కనిపిస్తుంది. అలాగే సముద్రం ఒడ్డున గ్లామరస్ లుక్కులో కట్టిపడేస్తుంది.
ఇటీవలే దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తుంది. అలాగే దేవర 2 సినిమాతోపాటు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తే నటించేందుకు రెడీ అయ్యింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో జాన్వీకి సంబంధించిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అందం, అభినయంతో మెస్మరైజ్ చేస్తున్నాయి. తాజాగా గ్లామరస్ లుక్కులో మెంటలెక్కిస్తోంది. ఇప్పుడు పెద్ది సినిమా చిత్రీకరణలో పాల్గొంటుంది.