ఆగస్టు 6.. ప్రపంచ చరిత్రలో ఒక చీకటి రోజు. 1945లో యునైటెడ్ స్టేట్స్ జపాన్‌పై అణు బాంబు దాడిని ప్రారంభించింది ఈ రోజే. ఆగస్టు 6న, హిరోషిమా నగరంపై అణు బాంబును వేశారు. ఆగస్టు 9న, నాగసాకి నగరంపై అణు బాంబును వేశారు. ఈ సంఘటనలు జరిగి 80 సంవత్సరాలు గడిచాయి. ఈ సందర్భంగా , ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ కొత్త సినిమాను ప్రకటించారు. ‘గోస్ట్స్ ఆఫ్ హిరోషిమా ‘ రచన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు కామెరూన్ వెల్లడించారు. ‘టెర్మినేటర్’, ‘టైటానిక్’, ‘అవతార్’ వంటి చిత్రాల ద్వారా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని పొందారు కామెరూన్. కానీ ‘అవతార్’ తర్వాత ఆయన కొత్త సినిమాలను ప్రకటించలేదు. ‘అవతార్’ సిరీస్ తోనే బిజీగా ఉంటున్నాడు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఆయన కొత్త సినిమాను ప్రకటించారు.
‘టైటానిక్’ తరహాలో మళ్లీ ఒక నిజమైన సంఘటన ఆధారంగా సినిమా తీయాలని జేమ్స్ ఎదురు చూస్తున్నారు. దానికి హిరోషిమా కథ సరైనదని ఆయన భావిస్తున్నారు. ‘టైటానిక్ తర్వాత నాకు ఇంత మంచి కథ దొరకలేదు. నేను త్వరలో ఈ సినిమాను ప్రారంభిస్తాను’ అని జేమ్స్ కామెరూన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జేమ్స్ కామెరూన్ ‘అవతార్’ తప్ప మరే ఇతర సినిమాల వైపు దృష్టి పెట్టకపోవడంతో ఆయన అభిమానులు కాస్త నిరాశ చెందారు. ఇప్పుడు ఆయన కొత్త సినిమా ప్రకటించడంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఈ సినిమా ఎప్పుడు సెట్ అవుతుంది? ఇందులో ఎవరు నటిస్తారు మొదలైన వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయి.
ఇవి కూడా చదవండి
హిరోషిమా బాంబుదాడి ఘటన ఆధారంగా..
I’m very excited to announce publication day for Ghosts of Hiroshima, an extraordinary new book from Charles Pellegrino that I am excited to direct as a film.
I’m attracted to great stories and not since Titanic have I found a true story as powerful as this one. Order it! pic.twitter.com/oFLITDe1be
— James Cameron (@JimCameron) August 5, 2025
జేమ్స్ కామెరూన్ ప్రస్తుతం ‘అవతార్’ సీక్వెల్ పై దృష్టి సారించారు. రెండవ భాగం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ 2022 లో విడుదలైంది. మూడవ భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాషెస్’ ఈ సంవత్సరం డిసెంబర్ 19 న విడుదల కానుంది. ‘అవతార్ 4’ 2029 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..