Jacqueline Fernandez: విచారణకు రావాల్సిందే.. జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌కు హైకోర్టు షాక్..

Jacqueline Fernandez: విచారణకు రావాల్సిందే.. జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌కు హైకోర్టు షాక్..


బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. తనపై రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసును కొట్టేయాలన్న జాక్వెలిన్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. మనీలాండరింగ్ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను ఆపాలంటూ జాక్వెలిన్ ఢిల్లీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఆ క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఆర్థిక నేర‌స్థుడు సుఖేశ్‌ శ్ చంద్రశేఖ‌ర్‌ ను మనీలాండరింగ్ కేసులో విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆ ఛార్జిషీట్‌లో జాక్వెలిన్ పేరును కూడా చేర్చి విచారించింది. నిందితుడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ నేరచరిత్ర తెలిసినప్పటికి అతడి నుంచి విలువైన బహుమతులను ఎందుకు తీసుకున్నారని న్యాయస్థానం జాక్వెలిన్‌ను ప్రశ్నించింది. అయితే సుఖేశ్ మనీలాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ అయినట్టు తనకు తెలియదని జాక్వెలిన్ వాదిస్తోంది. కాబట్టి, ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన రెండో అనుబంధ ఛార్జిషీట్‌ను, ట్రయల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న విచారణలను కూడా రద్దు చేయాలని జాక్వెలిన్ కోరింది.

ఈ కేసులో అన్ని పక్షాల వాదనలు విన్న హై కోర్టు ఏప్రిల్‌లో తన తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పులో జాక్వెలిన్ క్యాష్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు శివిందర్ సింగ్, మల్వీందర్ సింగ్ జీవిత భాగస్వాములను మోసం చేశాడనే ఆరోపణలపై సుఖేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. సుఖేష్, అతని భార్య లీనా పౌలోస్ హవాలా మార్గాలను ఉపయోగించారని, మోసం ద్వారా సంపాదించిన డబ్బును కాపాడుకోవడానికి ఇతర నిందితులతో కలిసి షెల్ కంపెనీలను సృష్టించారని ఈడీ ఆరోపిస్తోంది.

అయితే సుఖేశ్ నుంచి విలువైన బహుమతులను స్వీకరించి జాక్వెలిన్‌ కూడా నేరంగా భాగమయ్యారని ఈడీ వాదిస్తోంది. మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ను ఈడీ పలుమార్లు విచారించింది. నేరుగా ఆమె కోర్టు విచారణకు కూడా హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *