Jabardasth Nukaraju: అతనితో ఆసియా పెళ్లి.. గుండె పగిలేలా ఏడ్చిన జబర్దస్త్ నూకరాజు.. వీడియో వైరల్

Jabardasth Nukaraju: అతనితో ఆసియా పెళ్లి.. గుండె పగిలేలా ఏడ్చిన జబర్దస్త్ నూకరాజు.. వీడియో వైరల్


పటాస్ కామెడీ షో ద్వారా మొదటగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యారు నూకరాజు- ఆసియా. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జంటగా కలిసి ఎన్నో స్కిట్స్ చేసి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. ఆన్ స్క్రీన్ లో ఎక్కువగా ప్రేమికులుగా కనిపించే నూకరాజు- ఆసియా నిజ జీవితంలోనూ మంచి స్నేహితులు. అదే సమయంలో వీరు ప్రేమలో కూడా పడ్డారని ప్రచారం జరిగింది. అయితే, ఆ మధ్య వీరిద్దరికి గొడవలు జరిగి బ్రేకప్ కూడా కూడా అయ్యిదంటూ ఎన్నో వార్తలు నెట్టింట హల్ చల్ చేశాయి. అయితే ఈ లవ్,బ్రేకప్ వార్తలపై ఇప్పటివరకు నూకరాజు కానీ, ఆసియా కానీ ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం వీరు తమ ప్రొఫెషనల్ లైఫ్ తో బిజి బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. నూకరాజు- ఆసియా కలిసి ప్రస్తుతం ప్రైవేట్ ఆల్బమ్స్, మ్యూజిక్ వీడియోలు చేస్తున్నారు. ఇంతకు ముందు వీరి కలిసి చేసిన నా గుండె గోదారి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కు యూట్యూట్ లో కొన్ని లక్షల వ్యూస్, లైకులు వచ్చాయి. అలాగే తాటి బెల్లం సాంగ్, ఉరితాడు ఉయ్యాలయ్యిందా? నా చెల్లెమ్మా పాటలకు కూడా యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మరో అందమైన ఫోక్ సాంగ్తో మన ముందుకు వచ్చారు నూకరాజు- ఆసియా. జబర్దస్త్ ఫేమ్ బాబు డైరక్షన్లో తెరకెక్కిన సల్లగుండరాదే సాంగ్ ప్రోమో శుక్రవారం (జులై 04) విడుదలైంది. ఈ పాటలో ఆసియా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో నూకరాజు తల్లడిల్లిపోతాడు. ఆసియాతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుని తనలో తాను కుమిలిపోతాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన వారందరూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రీల్ లైఫ్ లో ఒకే బట్ రియల్ లైఫ్ లో ఇలా జరగకూడదు.. మేం తట్టుకోలేం, ఆసియా నువ్వు ఎప్పుడూ నూకరాజుతోనే ఉండాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. అదే సమయంలో ఈ పాట సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ విషెస్ చెబుతున్నారు. జబర్దస్త్ బాబు సాంగ్ మేకింగ్ అద్దిరిపోయిందని, నూకరాజు ఎప్పటిలాగే తన యాక్టింగ్ తో అదరగొట్టాడని, ఆసియా అందంగా ఉందని నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కాగా త్వరలోనే ఈ సాంగ్ ఫుల్ వెర్షన్ రిలీజ్ కానుంది.

సల్లగుండరాదే సాంగ్ ప్రోమో..



ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *