జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్, జోర్దార్ జోడీ ఒకటి. ఈ వేదికపై కలిసి ఎన్నోస్కిట్లు చేసిన వీరు నిజ జీవితంలోనూ కపుల్ గా మారారు. పెద్దల ఆశీర్వాదంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 24న తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఏడడుగులు వేశారు రాకేష్- సుజాత. ఈ ప్రేమ బంధానికి ప్రతీకగా గతేడాది ఆగస్టులో ఈ దంపతులకు ఒక కూతురు జన్మించింది. తమ ఇంటి మహాలక్ష్మికి ఖ్యాతిక అని నామకరణం చేశారు. తాజాగా తమ కూతురి మొదటి పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు జబర్దస్త్ కపుల్. ఆగస్టు 1వ తేదీన జరిగిన ఖ్యాతిక బర్త్ డే వేడుకల్లో జబర్దస్త్ ఆర్టిస్టులతో పాటు పలువురు బుల్లితెర నటీనటులు సందడి చేశారు. అలాగే జబర్దస్త్ మాజీ జడ్జి, సినీనటి, మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా ఈ పుట్టిన రోజు వేడుకలో సందడి చేశారు. రాకేష్ కుమార్తెను ఎత్తుకొని సరదాగా ఆడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది.
కాగా తమ గారాల పట్టి మొదటి బర్త్ డేను పురస్కరించుకుని సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ లు పెట్టారు రాకింగ్ రాకేష్- సుజాత.
‘1/08/.. ఈ రోజు మా జీవితంలోకి సాక్షాత్తు అమ్మవారే వచ్చినరోజు…మా ఇంట వెలుగులు నింపిన రోజు…అమ్మానాన్నలుగా మేము వరం పొందిన రోజు.. నా బంగారు తల్లి పుట్టినరోజు…. నా ఖ్యాతికమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసుకున్న రోజు..అప్పుడే సంవత్సరం కావొస్తుంది..పుట్టినరోజు శుభాకాంక్షలు ఖ్యాతికమ్మా…మా అదృష్టదేవతను అద్భుతంగా చూసుకునేలా మమ్మల్ని ఆశీర్వదించండి’ అని ఖ్యాతిక పుట్టిన రోజు వేడుకల ఫొటోలను షేర్ చేశారు జబర్దస్త్ కపుల్.
ఇవి కూడా చదవండి
రాకింగ్ రాకేష్ కూతురిని లాలిస్తోన్న రోజా.. వీడియో
ప్రస్తుతం రాకింగ్ రాకేష్ కూతురి పుట్టిన రోజు వేడుకల ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. బుల్లితెర ప్రముఖులు, సినీ అభిమానులు కూడా ఖ్యాతికకు బర్త్ డే విషెస్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో రాకింగ్ రాకేష్ ఫ్యామిలీ..
ఖ్యాతిక బర్త్ డే వేడుకల ఫొటోలు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..