ITR: ఐటీఆర్ దాఖలుకు సమయం ఉంది మిత్రమా.. ఎన్ని రోజులు పొడిగించారంటే..?

ITR: ఐటీఆర్ దాఖలుకు సమయం ఉంది మిత్రమా.. ఎన్ని రోజులు పొడిగించారంటే..?


ITR: ఐటీఆర్ దాఖలుకు సమయం ఉంది మిత్రమా.. ఎన్ని రోజులు పొడిగించారంటే..?

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ తీసుకున్ని ఈ నిర్ణయం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ ఏడాది ఐటీఆర్ ఫారాల నోటిఫికేషన్ లో జాప్యం జరిగింది. అలాగే సాప్ట్ వేర్ యుటిలీటీలు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఐటీఆర్ దాఖలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారం సెప్టెంబర్ 15 లోపు చెల్లిస్తే సెల్ప్ అసెస్ మెంట్ పన్నుపై ఎటువంటి జరిమానా ఉండదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 (1) కింద జరిగిన ఐటీఆర్ గడువు తేదీ పొడిగింపుతో రిటర్న్స్, స్వీయ అంచనా పన్ను రెండింటినీ సెప్టెంబర్ 15వ తేదీ లోపు చెల్లిస్తే సెక్షన్ 234ఏ కింద ఎటువంటి వడ్డీ వసూలు చేయరు. ఈ గడువు పొడిగింపు వల్ల స్వీయ అంచనా పన్నుకు ఉపశమనం కలుగుతుంది. అయితే సెక్షన్ 234బీ, 234 సీ కింద వడ్డీ మినహాయింపు ఉండదు. ఎందుకంటే ఆ విభాగాలు ముందస్తు పన్ను చెల్లింపులకు సంబంధించినవి. పన్ను చెల్లింపుదారులు వీటిని తక్కువగా చెల్లించినా, ఆలస్యంగా కట్టినా నెలకు 19 శాతం జరిమానా వడ్డీ విధిస్తారు. ఈ జరిమానాలకు ఐటీఆర్ దాఖలు తేదీతో సంబంధం ఉండదు.

పన్ను చెల్లింపుదారులు బీమా ప్రీమియాలకు రూ.25 వేల వరకూ మినహాయింపులు పొందవచ్చు. బీమా చేసిన వ్యక్తికి 60 ఏళ్ల పైబడి వయసుంటే రూ.50 వేల వరకూ తగ్గింపు వర్తిస్తుంది. అలాగే జీతం పొందే వ్యక్తి తన జీతంలోని ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఎల్ఠీఏ)పై మినహాయింపులు పొందే వీలుంది. పాత పన్ను విధానంలో రూ.50 వేల ప్రామాణిక మినహాయింపులు పొందవచ్చు.

పాత పన్ను విధానంలో శ్లాబ్ రేట్లు అలాగే కొనసాగుతున్నాయి. ఆ పద్ధతి ప్రకారం రూ.2.50 లక్షల వరకూ పన్ను లేదు. రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఐదుశాతం, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వ రకూ 20 శాతం, పది లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30 శాతం పన్ను విధిస్తారు. 60 నుంచి 80 ఏళ్ల వయసున్న సీనియర్ సిటీజన్లకు ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ.3 లక్షలు, 80 ఏళ్లకు పైబడిన సూపర్ సీనియర్లకు రూ.5 లక్షల వరకూ అందిస్తున్నారు.

కొత్త పన్ను విధానాన్ని 2020 కేంద్ర బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. పాత విధానంతో పొల్చితే ఎక్కువ పన్ను శ్లాబ్ లు, తక్కువ పన్ను రేట్లు ఉన్నాయి. పాత విధానంలో ఇస్తున్న మినహాయింపులను తగ్గించారు. ఆ ప్రకారం.. రూ.3 లక్షల వరకూ ఆదాయానికి పన్ను లేదు. రూ.3,00,001 నుంచి రూ.7 లక్షల వరకూ ఐదు ఉంటుంది. రూ.7,00,001 నుంచి రూ.10 లక్షల వరకూ పదిశాతం ఉంటుంది. రూ.10,00,001 నుంచి రూ.12 లక్షల వరకూ 15 శాతం కట్టాలి. రూ.12,00,001 నుంచి రూ.15 లక్షల వరకూ 20 శాతం, రూ.15 లక్షలకు పైగా ఆదాయానికి 30 శాతం చెల్లించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *