Ishan Kishan : భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నాటింగ్‌హామ్‌షైర్ తరపున ఆడుతున్నాడు. తను ఇటీవల అద్భుతమైన బ్యాటింగ్, వికెట్ కీపింగ్ తో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఈసారి తను తన బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అక్కడ అతను భారత దిగ్గజ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ ను ఇమిటేట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇషాన్ కు నాటింగ్‌హామ్‌షైర్ వర్సెస్ సోమర్‌సెట్ మ్యాచ్‌లో బౌలింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. అప్పటికే మ్యాచ్ డ్రా అవుతుందని తేలిపోయింది. మ్యాచ్ చివరి ఓవర్ వేయడానికి ఇషాన్ కు అవకాశం దక్కింది. ఇషాన్ మొదటి నాలుగు బంతులను ఆఫ్ స్పిన్ వేశాడు. ఈ క్రమంలో తను హర్భజన్ సింగ్ యాక్షన్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఆ తర్వాత అతను సైడ్ మార్చి, లెగ్ స్పిన్ కూడా వేశాడు. ఇషాన్ ఆ ఓవర్‌లో కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు.
Ishan Kishan bowling in County Cricket 🔥
He bowled an over with an economy of 1.🙌🏻#IshanKishan pic.twitter.com/qfJia0kZjg— Ayush (@AyushCricket32) July 3, 2025
రెండు జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. సోమర్‌సెట్ మొదటి ఇన్నింగ్స్‌లో 379 పరుగులు చేసింది. దానికి సమాధానంగా నాటింగ్‌హామ్‌షైర్ మొదటి ఇన్నింగ్స్‌లో 509 పరుగులు చేసింది. ఆ తర్వాత సోమర్‌సెట్ తమ రెండో ఇన్నింగ్స్‌లో చివరి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది.
కౌంటీ క్రికెట్‌లో ఇషాన్ కు ఇది రెండో మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఇషాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇషాన్ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. ఇషాన్ 77 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 8 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. దీనికి ముందు ఇషాన్ తన కౌంటీ అరంగేట్రంలో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను యార్క్‌షైర్‌పై కేవలం 98 బంతుల్లో 87 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఈశాన్ 12 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..