Ishan Kishan : భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నాటింగ్‌హామ్‌షైర్ తరపున దుమ్మురేపుతున్నాడు. కేవలం తన బ్యాటింగ్‌తోనే కాదు, అప్పుడప్పుడు బౌలింగ్‌తోనూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్, భారత దిగ్గజ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్, దివంగత ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ బౌలింగ్ యాక్షన్‌లను అనుకరించి బౌలింగ్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇషాన్ కిషన్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఈ రెండింటిలోనూ అద్భుతంగా ఆడాడు. యార్క్‌షైర్‌పై 87 పరుగులు చేసి మెరిసిన ఇషాన్ సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 77 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ తృటిలో మిస్ అయినా జట్టుకు కీలక పరుగులు అందించాడు. ఈ ప్రదర్శనలు టీమిండియాలో అతని స్థానాన్ని మరింత పటిష్టం చేస్తాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
సాధారణంగా వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా పేరున్న ఇషాన్ కిషన్ బౌలింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది 2014లో ఎంఎస్ ధోనీ న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో కొద్దిసేపు వికెట్ కీపింగ్ నుండి తప్పుకొని బౌలింగ్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసింది. సోమర్‌సెట్‌తో జరిగిన వర్షం అంతరాయం కలిగించిన డ్రా మ్యాచ్‌లో ఇషాన్ తనలోని మరో కోణాన్ని చూపించాడు. అనూహ్యంగా అతనికి బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. ఇషాన్ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.
తన ఓవర్‌లో ఆఫ్-స్పిన్, లెగ్-స్పిన్ రెండింటినీ ప్రయత్నించాడు. చివరికి రౌండ్ ది వికెట్‌కు కూడా మారాడు. ఓవర్‌ను హర్భజన్ సింగ్ బౌలింగ్ యాక్షన్‌ను ఇమిటేట్ చేస్తూ ప్రారంభించాడు. ఆ తర్వాత లెగ్-స్పిన్నర్ వేసేటప్పుడు దివంగత క్రికెటర్ షేన్ వార్న్ యాక్షన్‌ను అనుకరించాడు. ఇందుకు క్లిప్‌ను అధికారిక కౌంటీ ఛాంపియన్‌షిప్ సోషల్ మీడియా హ్యాండిల్ షేర్ చేసింది. ఇషాన్ ఈ ఓవర్‌లో కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చి తన బౌలింగ్ టాలెంట్ కూడా చూపించాడు. ఇషాన్ కిషన్ చివరిసారిగా జూలై 2023లో వెస్టిండీస్ పర్యటనలో భారత్ తరపున టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2025 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన ఇషాన్ 14 మ్యాచ్‌లలో 354 పరుగులు సాధించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..