లీడ్స్ టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌పై చారిత్రాత్మక విజయం నమోదు చేయడం ద్వారా ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లీష్ జట్టు బ్యాట్స్‌ర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ చివరి రోజున ఐదు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు. ఈ విజయంలో ఇంగ్లాండ్ ఓపెనర్లు కీలకమైన పాత్ర పోషించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓపెనర్లు ఇద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 188 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి జట్టు విజయానికి పునాది వేశారు. ఈ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన బెన్ డకెట్ సెంచరీ చేశాడు. దీంతో ఇంగ్లండ్ విజయం చాలా సులభం అయ్యింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంలో బెన్ డకెట్‌ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. కానీ.. తరువాత అతన్నిIPLలో ఆడటానికి పిలిచారు. దీనికి అతడు నిరాకరించాడు. చివరికి ఇప్పుడు టీమిండియాకు చేదు అనుభవాన్ని మిగిల్చాడు.
IPL 2025 వేలం.. ధర రూ. 2కోట్లు..
ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఇంకా ఐపీఎల్‌లో అడుగుపెట్టలేదు. ఈ ఏడాది మెగా వేలంలో తన పేరును రెండు కోట్ల బేస్ ధరకు పెట్టాడు. కానీ ఏ జట్టు అతన్ని కొనుగోలు చేయలేదు. ఇంగ్లాండ్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడిన డకెట్.. ఐపీఎల్ వేలంలో ఏ జట్టు తనను కొనుగోలు చేయకపోవడంతో నిరాశచెందాడు. దీంతో అతడు చాలా బాధపడ్డాడు. కానీ, డకెట్‌కి ఓ జట్టు అవకాశం ఇచ్చింది. జట్టులోకి రమ్మని ఆహ్వానించించి. కానీ.. ఇప్పుడు అతడు నిరాకరించాడు.
డకెట్‌కు అవకాశం ఇచ్చిన జట్టిదే..
ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ (DC) రూ.6.50 కోట్లతో సొంతం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అతని బిజీ షెడ్యూల్ కారణంగా బ్రూక్ IPLలో ఆడటానికి నిరాకరించాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ బెన్ డకెట్‌ను తమ జట్టులో చేరమని అభ్యర్థించింది. కానీ అతడు.. అందుకు నిరాకరించాడు. వేలంలో కొనలేదు.. ఇప్పుడు కావాలా అని అతడు వెనకడుగు వేశాడు. ఇప్పుడు ఈ బ్యాటరే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ చేసి టీమిండియాకు పెద్ద బాధ మిగిల్చాడు.
లీడ్స్‌లో సెంచరీ మోత..
371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. బెన్ డకెట్ అద్భుతమైన సెంచరీ సాధించి టీమిండియా నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. అతను 170 బంతుల్లో 21 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో 149 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా, ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్‌ను 5 వికెట్ల తేడాతో గెలుచుకుంది. బెన్ డకెట్ ఇప్పటివరకు 34 టెస్ట్ మ్యాచ్‌ల్లో 2621 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..