ఇంకా ఆరు వారాలు మాత్రమే సమయం ఉండటంతో రైల్వే జోన్ పనులను అధికారులు వేగవంతం చేశారు. ఈ నెలాఖరు కల్లా కొత్త జోన్ ప్రారంభంపై అధికారికంగా ఓ ప్రకటన రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ నడుస్తోంది. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ ఈ జోజ్ పరిధిలో ఉన్నాయి.