Headlines

Indian Railways: ఏపీ, తెలంగాణ వాసులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్..

Indian Railways: ఏపీ, తెలంగాణ వాసులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్..


తెలుగు రాష్ట్రాల నుంచి కర్ణాటకకు ప్రయాణించే వారికి రైల్వే శాఖ తీపి కబురు అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా కాకినాడ, నర్సాపూర్ నుంచి బెంగళూరు, మైసూర్ నగరాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఇదే సమయంలో నిర్వహణ పనుల కారణంగా కొన్ని లోకల్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

కాకినాడ టౌన్ – మైసూర్ ప్రత్యేక రైలు

ఈ రైలు మార్చి నెల మొత్తం అందుబాటులో ఉంటుంది. గోదావరి జిల్లాల నుంచి అటు తెలంగాణ, ఇటు రాయలసీమ మీదుగా కర్ణాటకకు వెళ్లే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మార్చి 2వ తేదీ నుంచి మార్చి 31 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. సామర్లకోట, రాజమహేంద్రవరం, భీమవరం టౌన్, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, మంత్రాలయం, అనంతపురం, బెంగళూరు మీదుగా మైసూర్ చేరుకుంటుంది.

బెంగళూరు – నర్సాపూర్ ప్రత్యేక రైలు

కోస్తా ఆంధ్ర ప్రాంతం నుంచి ఐటీ నగరం బెంగళూరుకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థుల కోసం ఈ రైలును అందుబాటులోకి తెచ్చారు. మార్చి 6వ తేదీ నుంచి మార్చి 28 వరకు అందుబాటులో ఉంటుంది. నర్సాపూర్, పాలకొల్లు, భీమవరం టౌన్, విజయవాడ, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి మీదుగా బెంగళూరు చేరుకుంటుంది.

అప్రమత్తత: నిర్వహణ పనులతో రైళ్ల రద్దు

ట్రాక్ నిర్వహణ, ఇతర సాంకేతిక పనుల దృష్ట్యా, విజయవాడ డివిజన్‌లో నడిచే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో విజయవాడ – డోర్నకల్, విజయవాడ – గుంటూరు రైళ్లను రద్దు చేశారు. ఈ రెండు రోజులు ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.

కాగా ప్రత్యేక రైళ్లలో సీట్ల రిజర్వేషన్ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రయాణికులు ఆన్‌లైన్ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. రైళ్ల రద్దు సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని, స్టేషన్‌కు బయలుదేరే ముందు ఒకసారి రైల్వే హెల్ప్‌లైన్ లేదా యాప్‌లో స్టేటస్ చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *