India US Trade Deal: అమెరికా-భారత్ ట్రేడ్ డీల్‌.. దేశంలో ఈ వస్తువులు ఇక చవక చవక.. ఏయే ధరలు తగ్గుతాయంటే..?

India US Trade Deal: అమెరికా-భారత్ ట్రేడ్ డీల్‌.. దేశంలో ఈ వస్తువులు ఇక చవక చవక.. ఏయే ధరలు తగ్గుతాయంటే..?


అమెరికా-భారత్ మధ్య ట్రేడ్ డీల్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా వస్తువులపై భారత్ సుంకాలను తగ్గించింది. అలాగే మరికొన్ని వస్తువులపై అసలు ట్యాక్సులను వసూలు చేయకుండా డీల్ కుదిరింది. ఇక భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై టారిఫ్‌లను 50 శాతం నుంచి 18 శాతానికి అమెరికా తగ్గించింది. దీని వల్ల చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పడిపోనున్నాయి. అగ్రికల్చర్, టెక్నాలజీ, ఎనర్జీ, ఎయిర్‌క్రాఫ్ట్స్ వంటి వస్తువులను అమెరికా నుంచి భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు అక్కడ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారత్ సుంకాలు తగ్గించడంతో వాటి ధరలు పడిపోనున్నాయి. ఏయే ధరలు తగ్గుతాయో ఒకసారి చూద్దాం.

ఈ ధరల ఇక చౌవక

వైన్, స్పిరిట్స్ అమెరికా నుంచి భారత్‌కు ఎక్కువగా దిగుమతి అవుతుంటాయి. దీంతో వీటి ధరలు త్వరలో తగ్గుతాయి. ఇక ట్రీ నట్స్ అయిన బాదం, ఆక్రోట్, పిస్తా ధరలతో పాటు ప్రెష్, ప్రాసెస్డ్ ఫ్యూట్స్ అయిన ఆపిల్ పియర్ ధరలు తగ్గనున్నాయి. ఇక సోయాబీన్ ఆయిల్, అనిమల్ ఫీడ్, డ్రైడ్ డిస్టిల్లర్స్ గైన్స్ అయిన పశువుల ఆహారం వంటి ధరలు పడిపోనున్నాయి. ఇక భారత్ నుంచి అమెరికా ఎగుమతి అయ్యే వస్తువులకు కూడా వాణిజ్య ఒప్పందం వల్ల లాభం జరగనుంది. భారత్ నుంచి అమెరికాకు ఎక్కువగా ఆర్గానిక్స్ కెమికల్స్, ప్లాస్టిక్, రబ్బర్, లెదర్ ఫుట్‌వేర్, టెక్స్ టైల్స్, హోమ్ డెకర్, ఆర్టిసనల్ ఉత్పత్తులు వంటివి ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా సుంకాలు తగ్గించడంతో వాటిని బెనిఫిట్ జరగనుంది.

ఫార్మసీ కంపెనీలకు లాభం

భారత్ మెడికల్స్‌కు హాబ్‌గా ఉంది. ఇక్కడ నుంచి విదేశాలకు మెడిసిన్స్ భారీగా ఎగుమతి అవుతాయి. గతంలో అమెరికాకు ఎగుమతి చేసే మెడికల్ ఉత్పత్తులపై సుంకాలు ఉండేవి. ఇప్పుడు సుంకాలను తీసివేయడంతో అమెరికాలో మందుల ధరలు తగ్గనున్నాయి. దీని వల్ల భారత్‌లోని ఫార్మసీ కంపెనీలకు లాభం జరగనుంది. ఇక గతంలో ఒక్కొ స్ట్రిప్ 15 డాలర్లకు అమ్మేవారు. ఇప్పుడు ఆ ధర 10 డాలర్లకు పడిపోయింది. దీని వల్ల అమెరికా ప్రజలు మందులు చవకగా లభించనున్నాయి. ఇక చేతివృత్తులు, పట్టు, విమాన భాగాల ఉత్పత్తులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. ఈ వాణిజ్య ఒప్పందం వల్ల రెండు దేశాలకు లాభం జరగనుందని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *