India Post Jobs 2026: పదో తరగతితో పోస్టాఫీసుల్లో 28,636 ఉద్యోగాలు.. మరికొన్ని గంటలే ఛాన్స్! డైరెక్ట్‌ లింక్‌ ఇదిగో

India Post Jobs 2026: పదో తరగతితో పోస్టాఫీసుల్లో 28,636 ఉద్యోగాలు.. మరికొన్ని గంటలే ఛాన్స్! డైరెక్ట్‌ లింక్‌ ఇదిగో


భారత ప్రభుత్వ తపాలా శాఖకు చెందిన దేశ వ్యాప్తంగా ఉన్న తపాలా కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 28,636 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తులు కూడా ఇప్పటికే మొదలైనాయి. ఈ నోటిఫికేషన్ కింద బ్రాంచ్ పోస్టు మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ABPM), డాక్ సేవక్ విభాగాల్లోని పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 1060, తెలంగాణకు 608 పోస్టులను కేటాయించారు. పదో తరగతి అర్హత కలిగిన ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు సోమవారంతో ముగియనున్నాయి. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 16, 2026వ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందని తపాలా శాఖ సూచించింది.

పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఎవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదన్నమాట. కేవలం పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కులే తుది ఎంపికకు ప్రాతిపదిక. గడువు సమీపిస్తున్నందున అర్హులైన వారు వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

18 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయసు ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు, ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు జీతంగా చెల్లిస్తారు. ఎంపికైన వారికి మొబైల్‌ ఎస్‌ఎంఎస్‌ లేదా ఈమెయిల్‌ లేదా పోస్టు ద్వారా సమాచారం అందిస్తారు.

ఇవి కూడా చదవండి

తపాలా ఖాఖలో 28,636 ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *