ICC T20 World Cup India vs Pakistan Playing XI: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య నేడు హై ఓల్టేజీ మ్యాచ్ జరుగుతోంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మొదలైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తొలుత బౌలింగ్ చేయనుంది.
కొలంబోలో వర్షం పడే అవకాశం 50% ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం కొలంబోలో వర్షం లేదు, కానీ ఆకాశం మేఘావృతమై ఉంది. గత సంవత్సరం ఆసియా కప్ ఫైనల్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ తలపడ్డాయి. సెప్టెంబర్ 28, 2024న, భారత్ పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..