IND vs PAK: వర్షం పడితే టీమిండియా టార్గెట్ ఎంత.. ఈ డీఎల్ఎస్ లెక్కలు మీకోసం..!

IND vs PAK: వర్షం పడితే టీమిండియా టార్గెట్ ఎంత.. ఈ డీఎల్ఎస్ లెక్కలు మీకోసం..!


India vs Pakistan: భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం పడే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రం కొలంబో ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ సమయంలో దాదాపు 60% నుంచి 80% వర్షం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అందువల్ల, భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావచ్చు లేదా మ్యాచ్ తక్కువ ఓవర్లతో (DLS నియమం ప్రకారం) ఆడవచ్చు.

పాకిస్తాన్ లేదా భారత జట్టు 20 ఓవర్లు ఆడి 200 పరుగులు చేసిన తర్వాత వర్షం పడితే, ఓవర్లు తగ్గించబడతాయి. భారత్ లేదా పాకిస్తాన్‌కు ఇచ్చే DLS (డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్) లక్ష్యాలు ఎలా ఉంటాయో ఓసారి చూద్దాం..

15 ఓవర్లలో – 166 నుంచి 168 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వవచ్చు.

12 ఓవర్లలో – 140 నుంచి 142 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వవచ్చు.

10 ఓవర్లలో 122 నుంచి 124 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వవచ్చు.

5 ఓవర్లలో 71 నుంచి 74 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వవచ్చు.

ఇప్పుడు, మ్యాచ్ 10 ఓవర్లకు పరిమితం చేయబడి, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 10 ఓవర్లలో 125 పరుగులు చేసిందని అనుకుందాం. దీని తర్వాత వర్షం వచ్చి ఓవర్లు తగ్గిస్తే, DLS నిబంధనల ప్రకారం లక్ష్యం ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

8 ఓవర్లలో – 105 నుంచి 110 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వవచ్చు.

5 ఓవర్లలో – 75 నుంచి 110 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వవచ్చు.

DLS లక్ష్యం ఎందుకు పెరుగుతుంది?

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించే జట్టుకు మొదటి ఇన్నింగ్స్ తర్వాత ఇంకా 10 వికెట్లు మిగిలి ఉన్నందున, తక్కువ ఓవర్లలో మరింత దూకుడుగా ఆడటానికి అవకాశం ఉంది. అందువల్ల, ఓవర్లు తగ్గుతున్న కొద్దీ DLS నియమం ప్రకారం రన్ రేట్, లక్ష్యం పెరుగుతాయి.

దీని ప్రకారం, వర్షం వల్ల మ్యాచ్ కు అంతరాయం కలిగితే, ఓవర్ల తగ్గింపుతో పైన ఇచ్చిన విధంగా లక్ష్యాలు నిర్ణయించబడతాయి. అంటే ఇక్కడ వర్షం పడే అవకాశం ఉన్నందున రెండవ ఇన్నింగ్స్ ఆడుతున్న జట్టుకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కాబట్టి, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

5 ఓవర్లు ఆడాల్సిందే..

భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే, డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఫలితాన్ని నిర్ణయించడానికి రెండు జట్లు కనీసం 5 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.

ఉదాహరణకు, పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 150 పరుగులు చేసిందనుకుందాం. ఈ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో వర్షం మ్యాచ్‌ను ఆపివేస్తే, DLS నియమం ప్రకారం ఫలితాన్ని నిర్ణయించడానికి టీమిండియా కనీసం 5 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.

అంటే రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న జట్టుకు కనీసం 5 ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లేకపోతేనే మ్యాచ్ రద్దు అవుతుంది. మ్యాచ్ రద్దు అయితే, రెండు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *