IND vs PAK: ప్రేమదాస స్టేడియంలో భారత్, పాకిస్తాన్ రికార్డులు ఇవే.. ఆధిపత్యం ఎవరిదో తెలుసా?

IND vs PAK: ప్రేమదాస స్టేడియంలో భారత్, పాకిస్తాన్ రికార్డులు ఇవే.. ఆధిపత్యం ఎవరిదో తెలుసా?


India vs Pakistan T20 World Cup: 2026 టీ20 ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. క్రికెట్ ప్రపంచంలోని చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ నేడు అంటే, ఫిబ్రవరి 15, 2026న శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో తలపడనున్నాయి. కానీ, రుతుపవనాల వల్ల మ్యాచ్‌కు అంతరాయం కలగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఆందోళన మధ్య, ప్రేమదాస స్టేడియంలో ఇరు జట్ల ప్రదర్శనను ఓసారి పరిశీలిద్దాం..

భారత్ టీ20 రికార్డు..

ఈ రెండు జట్లు ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. ఇది కాకుండా, ఈ స్టేడియంలో భారత జట్టు 15 మ్యాచ్‌లు, పాకిస్తాన్ 7 మ్యాచ్‌లు ఆడింది. ఈ మైదానంలో భారత జట్టు మొత్తం 15 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 11 మ్యాచ్‌లను గెలిచింది. ఇందులో పాకిస్తాన్‌తో జరిగిన ఒక మ్యాచ్ కూడా ఉంది. 2012లో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది.

ఈ స్టేడియంలో భారత్ 4 టీ20 మ్యాచ్‌ ల్లో ఓడిపోయింది. ఇందులో శ్రీలంకపై 3, ఆస్ట్రేలియాపై ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ స్టేడియంలో భారత జట్టు తరపున టీ20 మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు శిఖర్ ధావన్ నిలిచాడు. మొత్తం 284 పరుగులు చేశాడు. ఇదిలా ఉండగా, యుజ్వేంద్ర చాహల్ 12 వికెట్లతో టాప్ బౌలర్ గా నిలిచాడు. కానీ వీరిద్దరూ ఇప్పుడు జట్టులో లేరు.

పాకిస్తాన్ టీ20 రికార్డు..

పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆర్. ప్రేమదాస స్టేడియంలో మొత్తం 7 టీ20 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో మొత్తం 5 మ్యాచ్‌లు గెలిచి 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. వీటిలో శ్రీలంకపై 3 మ్యాచ్‌లు, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై ఒక్కొక్క మ్యాచ్‌లో ఓడిపోయింది. ప్రేమదాస స్టేడియంలో పాకిస్తాన్ తరపున అత్యధిక టీ20 పరుగులు చేసిన ఆటగాడు ఉమర్ అక్మల్ (182 పరుగులు), సయీద్ అజ్మల్ 8 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.

రెండు జట్లు..

భారత జట్టు: ఇషాన్ కిషన్(కీపర్), సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్.

పాకిస్థాన్ జట్టు: సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ అజామ్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, ఉస్మాన్ ఖాన్(కీపర్), షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్, ఫఖర్ జమాన్, నసీమ్ షా, సల్మాన్ మీర్జా, ఖవాజా నఫై.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *