IND vs PAK: ద టీజ్ భారత్, పాక్ మ్యాచ్.. 10 సెకన్ల యాడ్ ధరెంతో తెలుసా? కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!

IND vs PAK: ద టీజ్ భారత్, పాక్ మ్యాచ్.. 10 సెకన్ల యాడ్ ధరెంతో తెలుసా? కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!


India vs Pakistan T20 World Cup 2026: ఫిబ్రవరి 15న జరిగే టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ రోజున భారత్, పాకిస్తాన్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల క్రికెట్ అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. వారితో పాటు శ్రీలంక పౌరులు కూడా ఈ మ్యాచ్ చూడటానికి ఆసక్తిగా ఉన్నారు. దీని కారణంగా కొలంబోకు వెళ్లే విమాన టిక్కెట్ల ధర రెట్టింపు అయింది. దీనితో పాటు కొలంబోలో హోటల్ గదుల ధర కూడా విపరీతంగా పెరిగాయి.

అదేవిధంగా, ప్రకటనల రేట్లు కూడా భారీగా పెరిగాయి. ప్రకటనల స్లాట్‌లను పొందడానికి కంపెనీలు భారీ మొత్తంలో డబ్బు చెల్లిస్తున్నాయి. నివేదిక ప్రకారం, ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం 10 సెకన్ల టీవీ ప్రకటనల స్లాట్‌కు రూ. 30 నుంచి 40 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రకటనల స్లాట్‌ల ధర 20 నుంచి 25 శాతం పెరిగింది. మొత్తం టోర్నమెంట్‌లో బ్రాడ్‌కాస్టర్ జియోస్టార్ ప్రకటనల ద్వారానే దాదాపు రూ. 2000 కోట్లు సంపాదించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ప్రకటనల స్లాట్ పొందేందుకు పోటీ..

డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్‌లో ప్రకటనల ధరలు పెరుగుతున్నాయి. ఇక్కడ 10 సెకన్ల ప్రకటన స్లాట్ రూ. 15 నుంచి 20 లక్షలకు చేరుకుంది. ఆటోమొబైల్, ఎఫ్‌ఎన్‌సీబీ, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రకటనల రంగంలో ఆసక్తిని కనబరుస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ టీ20 ప్రపంచ కప్‌లో ప్రకటనలు చేసే కంపెనీలలో ఎమిరేట్స్, అముల్, ఓపెన్ AI, హ్యుందాయ్, మహీంద్రా & మహీంద్రా, బ్రిటానియా వంటి అనేక ప్రధాన బ్రాండ్లు ఉన్నాయి.

విమాన టిక్కెట్లకు రెక్కలు..

క్రికెట్ అభిమానులు చాలా మంది భారతదేశం నుంచి కొలంబోకు ప్రయాణిస్తున్నారు. EaseMyTrip ప్రకారం, సాధారణ రోజులతో పోలిస్తే రౌండ్ ట్రిప్ విమాన ఛార్జీలు 45 నుంచి 50 శాతం పెరిగాయి. ఫిబ్రవరి 15 వారాంతంలో కొలంబోకు బుకింగ్‌లు మూడు రోజుల్లో రెట్టింపు అయ్యాయని MakeMyTrip వెల్లడించింది. ClearTrip ప్రకారం, భారతదేశం-పాకిస్తాన్ మ్యాచ్ కారణంగా కొలంబోకు బుకింగ్‌లు 65 శాతం పెరిగాయి.

ఆకాశాన్ని అంటుతోన్న హోటల్ ధరలు..

కొలంబోలో హోటల్ గదుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. నగర కేంద్రంలో నాలుగు, ఐదు నక్షత్రాల హోటళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అంతేకాకుండా, ప్రీమియం హోటల్ గదుల ధరలు కూడా 20 నుంచి 25 శాతం పెరిగాయి. మ్యాచ్ కారణంగా కొలంబోలోని అన్ని హోటళ్లు హౌస్‌ఫుల్‌గా ఉన్నాయని హోటళ్ల యజమానులు తెలిపారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *