IND vs PAK: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఒకటి కాదు, ఏకంగా 2సార్లు ఢీ కొట్టనున్న భారత్, పాక్ జట్లు.. ఎలాగంటే?

IND vs PAK: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఒకటి కాదు, ఏకంగా 2సార్లు ఢీ కొట్టనున్న భారత్, పాక్ జట్లు.. ఎలాగంటే?


IND vs PAK, T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగడం ఖాయమైంది. ఇప్పటి వరకు సందిగ్ధంగా ఉన్న ఈ మ్యాచ్ కు లైన్ క్లియర్ అయింది. దీంతో క్రికెట్ అభిమానులు డబుల్ ఖుషీగా ఉన్నారు. ఇప్పుడు ఒకటి కాదు, ఏకంగా రెండుసార్లు భారత్ – పాకిస్తాన్ జట్లు తలపనున్నాయి. అది ఎలాగో ఓసారి చూద్దాం.. మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది. అయితే, ఆ తర్వాత సూపర్ 8లో భాగంగా రెండవ మ్యాచ్ జరుగుతుందనుకుంటే పొరబడినట్లే.. ఎందుకో పూర్తి వివరాలు ఓసారి చూద్దాం..

గ్రూప్ దశలో భారత్-పాకిస్తాన్ తొలి పోరు..

ఫిబ్రవరి 15న జరిగే భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ గ్రూప్ దశలో ఉండనుంది. టోర్నమెంట్‌లో ఆడుతున్న 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించిన సంగతి తెలిసిందే. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. గ్రూప్ దశలో, ప్రతి గ్రూప్‌లోని జట్లు ఒకదానితో ఒకటి ఆడతాయనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రూప్ ఏలో చేరిన భారత్, పాకిస్తాన్ ఫిబ్రవరి 15న తలపడతాయి. టీ20 ప్రపంచ కప్ 2026లో గ్రూప్ దశ తర్వాత సూపర్-8 మ్యాచ్‌లు జరుగుతాయి. సూపర్-8లో రెండు గ్రూపులు ఉంటాయి. ఇందులో గ్రూప్ దశలోని ప్రతి గ్రూప్‌లోని మొదటి రెండు జట్లను ర్యాంకింగ్ ఆధారంగా విభజించనున్నారు.

సూపర్-8 గ్రూప్ ఎలా ఉంటుంది?

భారత్, పాకిస్తాన్ తమ గ్రూప్ ఏ లో అగ్రస్థానంలో ఉంటే, ఆస్ట్రేలియా, శ్రీలంక గ్రూప్ బీలో అగ్రస్థానంలో, అలాగే ఇంగ్లాండ్, వెస్టిండీస్ గ్రూప్ సీ నుంచి, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా గ్రూప్ డీ నుంచి అగ్రస్థానంలో ఉన్నాయనుకుంటే, అప్పుడు సూపర్ 8 గ్రూపులు ఇలా ఉండవచ్చు.

గ్రూప్ 1 లో భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా

గ్రూప్ 2 లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక

సూపర్ 8లో భారత్-పాకిస్తాన్ మధ్య పోరు..

సూపర్ 8 దశలో, ప్రతి జట్టు దాని స్వంత గ్రూప్‌లోని ప్రతి జట్టుతో ఒక మ్యాచ్ ఆడుతుంది. అంటే, టోర్నమెంట్ సూపర్ 8 దశలో భారత్, పాకిస్తాన్ మధ్య పోరు జరిగే అవకాశం లేదు. అయితే, భారత్, పాకిస్తాన్ జట్లు సెమీ-ఫైనల్స్‌కు చేరుకుంటే, అక్కడ పోటీ పడే ఛాన్స్ ఉంది. అది ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..

ఇలా జరిగితే, భారత్, పాకిస్తాన్ జట్లు సెమీఫైనల్స్ లేదా ఫైనల్స్‌లో పోరు..

గ్రూప్ 1లో భారత్ అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు చేరుకుంటే, సూపర్ 8లో గ్రూప్ 2 నుంచి పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరుకుంటే అభిమానులకు మరోసారి పండగే. భారత్ వర్సెస్ పాకిస్తాన్ రెండూ తమ తమ సూపర్ 8 గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిస్తే.. ఆ రెండు జట్ల మధ్య జరిగే రెండవ మ్యాచ్ ఫైనల్‌కు చేరుకునే వరకు వేచి ఉండాల్సిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *