IND vs NAM: వరుణ్ చక్రవర్తి మాయాజాలం.. నమీబియాపై భారత్ భారీ విజయం..

IND vs NAM: వరుణ్ చక్రవర్తి మాయాజాలం.. నమీబియాపై భారత్ భారీ విజయం..


IND vs NAM: వరుణ్ చక్రవర్తి మాయాజాలం.. నమీబియాపై భారత్ భారీ విజయం..

టీ20 ప్రపంచకప్‌లో 18వ మ్యాచ్‌లో భారత్‌ 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. భారత్ అందించిన 210 పరుగుల టార్గెట్‌ను చేరుకోలేక పోయిన నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో భారత జట్టు గ్రూపు ఏలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక తదుపరి మ్యాచ్‌లో అంటే, ఫిబ్రవరి 15న పాకిస్తాన్ జట్టుతో తలడనుంది.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నమీబియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ 209 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 61, హార్దిక్ పాండ్యా 52 పరుగులు చేశారు. నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్, ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

నమీబియా (ప్లేయింగ్ XI): లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), జేజే స్మిట్, జేన్ గ్రీన్(కీపర్), రూబెన్ ట్రంపెల్‌మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *