బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుల్లో ఒక్కసారిగా బజ్‌బాల్ ఎంట్రీ ఇచ్చింది. 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఇంగ్లాండ్.. ఇక లాభం లేదని.. ఉంటే ఉంటాం పోతే పోతాం అనే రీతిలో తమ ఆయుధాన్ని బయటికి తీసింది. అదే బజ్‌బాల్ ఆయుధం. ఇంగ్లాండ్‌కు బ్రెండన్ మెక్‌కల్లమ్ హెడ్ కోచ్‌గా, బెన్ స్టో్క్స్ టెస్ట్ కెప్టెన్ అయిన తర్వాత.. ఇంగ్లాండ్ న్యూ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడటం మొదలు పెట్టింది. టెస్టుల్లో పాత పద్దతిలో కాకుండా కాస్త అగ్రెసివ్ ఇంటెంట్‌తో ఆడాలని ఫిక్స్ అయింది. వేగంగా రన్స్ చేయడం ప్రారంభించింది. అది ఒక విధంగా ఇంగ్లాండ్‌కు కలిసొచ్చింది కూడా.. దీంతో ఈ స్టైల్ ఆఫ్ క్రికెట్‌ను బజ్ బాల్ క్రికెట్ అని పిలవడం మొదలుపెట్టారు.
కానీ కొన్ని నెలల ముందు నుంచ ఈ బజ్ బాల్ స్ట్రాటజీ పెద్దగా వర్క్‌అవుట్ కాలేదు. దీంతో ఇంగ్లాండ్ జట్టు కాస్త వెనక్కి తగ్గి మళ్లీ టెస్టు క్రికెట్‌ను టెస్టు క్రికెట్‌లా ఆడటం మొదలుపెట్టింది. కానీ, ఇప్పుడు తాజాగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఒక్కసారిగా బజ్‌బాల్ క్రికెట్‌ను గుర్తు తెచ్చేలా ఇంగ్లాండ్ బ్యాటర్ జేమీ స్మిత్ వేగంగా ఆడుతూ.. టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని అగ్రెసివ్ ఇంటెంట్‌తో ఒక్కసారిగా ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో జోష్ వచ్చేసింది. ఇతనేంటి ఇలా ఆడుతున్నాడు అని అర్థం చేసుకునేలోపే.. ఏకంగా సెంచరీ కొట్టేసి.. ఇంగ్లాండ్‌కు ఫాలోఅన్ గండాన్ని ఆల్‌మోస్ట్ తప్పించాడు. కేవలం 82 బంతుల్లోనే 14 ఫోర్లు, 3 సిక్సులతో 102 పరుగులు చేసి ఇంకా క్రీజ్‌లో ఉన్నాడు. ప్రసిద్ కృష్ణ వేసిన ఓ ఓవర్లో 4,6,4,4,4 బాది.. ఏకంగా 23 పరుగులు పిండుకున్నాడు.
అంతకంటే ముందు ఆకాశ్ దీప్, సిరాజ్ కలిసి 84 పరుగులకే 5 వికెట్లు కుప్పకూల్చి ఇంగ్లాండ్‌ను ఓటమి దిశగా వెళ్లేలా చేశారు. కానీ, హ్యారీ బ్రూక్‌కు జత కలిసిన స్మిత్.. ఇలా ఆడితే లాభం లేదు మన బజ్ బాల్ ఆటే కరెక్టు అన్నట్లు టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అది ఒక విధంగా సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. 84కు 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ఇప్పుడు 249 పరుగులకు చేరుకుంది. ఇంకా 6వ వికెట్ పడలేదు. రెండో రోజు చివర్లోనే ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయింది. ఈ రోజు సిరాజ్ వరుస బంతుల్లో జో రూట్, బెన్ స్టోక్స్‌ను అవుట్ చేసి.. ఇంగ్లాండ్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. కానీ, టీమిండియాకు ఆ సంతోషం లేకుండా చేశాడు స్మిత్. అయితే ఇంగ్లాండ్ ఇంకా 338 పరుగులు వెనుకబడి ఉంది.
Delivering on his incredible talent! 😍
Sensational from Jamie Smith! 🙌@IGcom | 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/jJoCMGn89O
— England Cricket (@englandcricket) July 4, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి