బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలోనే నిలిచింది. తొలి రోజు 5 వికెట్లు కోల్పోయినప్పటికీ.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. ఒక కెప్టెన్‌గా జట్టు కోసం ఎంతో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. మరో వైపు కెప్టెన్‌కు మంచి సపోర్ట్ ఇస్తూ సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా సైతం కీలకమైన ఇన్నింగ్స్ తొలి రోజు నాటౌట్‌గా నిలిచాడు. మొత్తం టీమిండియా తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్ 114, జడేజా 41 రన్స్ చేసి నాటౌట్‌గా ఉన్నారు. అయితే.. తొలి రోజు ఆటలో ఇంగ్లాండ్ బౌలర్లను గిల్ ఓ ఆటాడుకున్నాడు. గిల్‌ను అవుట్ చేసేందుకు ఇంగ్లాండ్ విశ్వప్రయత్నాలు చేసింది. కానీ, ఏదీ వర్క్ అవుట్ కాలేదు. చివరికి ఒక తప్పు చేసేందుకు కూడా వెనుకాడలేదు.
ఇంగ్లాండ్ బౌలర్ బ్రైడన్ కార్స్ 34వ ఓవర్లో బౌలింగ్ వేసేందుకు వచ్చాడు. ఆ టైమ్‌లో శుబ్‌మన్ గిల్ స్ట్రైక్‌లో ఉన్నాడు. బౌలింగ్ వేసేందుకు రన్నప్ ప్రారంభించిన బ్రైడన్ కార్స్ బంతి వేసేందుకు పరిగెత్తుకుంటూ వస్తూనే ఎడమ చేతి వేలితో వేరే వైపునకు సైగ చేశాడు. ఇది బహుశా బ్యాటర్ దృష్టిని మరల్చడానికి కావచ్చు. బ్యాటర్ తన ఏకాగ్రత కోల్పోతే.. మిస్ షాట్ ఆడే అవకాశం ఉందని భావించి, కార్స్ ఇలా చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే శుబ్‌మన్ గిల్ మాత్రం కార్స్ ట్రాప్‌లో పడలేదు. ఇలాంటి చాలా చూశాం అన్నట్లు.. సింపుల్‌గా పక్కకు తప్పుకున్నాడు. ఐపీఎల్ 2014 సందర్భంగా కూడా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. కేకేఆర్ బౌలర్ ఆండ్రీ రస్సెల్ షేన్ వాట్సన్‌కు బౌలింగ్ చేస్తూ ఇలాంటి ప్రయత్నమే చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా అంత మంచి స్టార్ట్ లభించలేదు. ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ ఓక్స్ ఆరంభంలోనే కేఎల్ రాహుల్‌ను అవుట్ చేసి.. గట్టి షాకిచ్చాడు. ఆ తర్వాత కరుణ్ నాయర్ 31, రిషభ్ పంత్ 25 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మరో ఎండ్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం సూపర్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 87 పరుగులు చేసి సెంచరీతో చేరువుగా వచ్చి అవుట్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపర్చాడు. ఆ తర్వాత కెప్టెన్ గిల్‌తో జడేజా జతకలిశాడు. మరో వికెట్ పడకుండా.. తొలి రోజును విజయవంతంగా ముగించారు. ఈ క్రమంలోనే గిల్ సెంచరీ పూర్తి చేసుకోగా.. జడేజా హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చేశాడు. కాగా గిల్ తొలి టెస్టులో కూడా సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
Mind games or genuine distraction? We’ll never know 🤷♂️#SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/iIO2NH1HXR
— Sony Sports Network (@SonySportsNetwk) July 2, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి