ఐదు టెస్టు మ్యాచ్‌లు సుదీర్ఘ సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లిన యంగ్ టీమిండియాకు తొలి మ్యాచ్‌లోనే ఊహించని షాక్ తగిలింది. బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించినప్పటికీ.. తొలి టెస్టులో గిల్ సేన ఓటమి పాలైంది. ఈ ఓటమి తర్వాత ఓ స్టార్ పేసర్‌ను ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు పంపించేశారు టీమ్ మేనేజ్‌మెంట్. తొలి టెస్ట్‌లో ఓడిపోయిన మరుసటి రోజు పేసర్ హర్షిత్ రాణాను జట్టు నుంచి విడుదల చేసినట్లు సమాచారం. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్ ఆరంభానికి కేవలం రెండు రోజుల ముందు రాణాను జట్టులోకి తీసుకున్నారు. అతను ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన రెండు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఇండియా ఎ జట్టులో భాగమయ్యాడు. ఆ తర్వాత అతన్ని బ్యాకప్ పేసర్‌గా టీమ్‌లోకి తీసుకున్నారు.
అయితే ప్రస్తుతం టీమ్‌లోని పేసర్లంతా ఫిట్‌గా ఉండటంతో రాణాను జట్టు నుంచి విడుదల చేస్తున్నట్లు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.”ప్రస్తుతానికి, ప్రతిదీ బాగానే ఉంది, కాబట్టి అందరూ బాగానే ఉంటే, అతను తిరిగి వెళ్లాల్సి ఉంటుంది” అని గంభీర్ అన్నారు. ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేసిన రాణా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభంలో ప్రసిద్ధ్ కృష్ణ కంటే మెరుగైన ప్రదర్శన చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టి మంచి ప్రదర్శన ఇచ్చాడు, కానీ రెండవ ఇన్నింగ్స్‌లో, తరువాతి టెస్ట్‌లో అదే స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు.
ఇక తొలి టెస్ట్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి రాణించిన జస్‌ప్రీత్ బుమ్రా తప్ప, మిగిలిన భారత బౌలింగ్ దాడి ప్రభావం చూపలేదు. మంగళవారం ముగిసిన తొలి టెస్ట్‌లో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత పేస్ త్రయం – ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్ – లైన్, లెంగ్త్ లలో స్థిరత్వం లేకపోవడం వల్ల ఇబ్బంది పడ్డారు. సులభంగా పరుగులు సమర్పించుకున్నారు. వీరి ప్రదర్శనపై గంభీర్ స్పందిస్తూ.. మన బౌలర్లకు మరింత సమయంలో ఇవ్వా్ల్సిన అవసరం ఉందని అన్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి