IND vs ENG: డీఎస్పీ సార్‌ ఆన్‌ డ్యూటీ..! బెన్‌ స్టోక్స్‌కు మైండ్‌బ్లాంక్‌ అయ్యే షాక్‌ ఇచ్చిన సిరాజ్‌..!

IND vs ENG: డీఎస్పీ సార్‌ ఆన్‌ డ్యూటీ..! బెన్‌ స్టోక్స్‌కు మైండ్‌బ్లాంక్‌ అయ్యే షాక్‌ ఇచ్చిన సిరాజ్‌..!


పులి రక్తం వాసన చూస్తే ఎలా కసిగా వేటాడుతుందో.. అలాగే క్రికెట్‌లో మొహమ్మద్‌ సిరాజ్‌కు ఒకటి రెండు వికెట్లు వస్తే.. ఇక అతన్ని ఆపడం కష్టం. బీభత్సమైన కాన్ఫిడెన్స్‌తో సూపర్‌గా బౌలింగ్‌ చేస్తాడు. సిరాజ్‌ చెలరేగాడంటే.. ప్రత్యర్థి జట్టు ఆశలు వదిలేసుకోవాల్సిందే. తనదైన రోజున వికెట్లు తీస్తూనే ఉంటాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో సిరాజ్‌ తన ట్రాక్‌ పట్టుకున్నట్లు కనిపిస్తున్నాడు. రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జాక్‌ క్రాలేను అవుట్‌ చేసిన సిరాజ్‌.. ఈ రోజు వరుస బంతుల్లో జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌లను అవుట్‌ చేసి, పెవిలియన్‌కు పంపాడు. ఈ రెండు వికెట్లు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు.

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 22వ ఓవర్‌ మూడో బంతికి జో రూట్‌ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. అప్పటికే రూట్‌ లాంటి కీలక వికెట్‌ తీసి.. ఫుల్‌ జోష్‌లో ఉన్న సిరాజ్‌ స్టోక్స్‌కు సెట్‌ అయ్యే ఛాన్స్‌ ఇవ్వలేదు. రాగానే ఫస్ట్‌ బాల్‌ను అద్భుతంగా బాడీపైకి బౌన్సర్‌ సంధించాడు. దాంతో తొలి బంతికే బెన్‌ స్టోక్స్‌ షాక్‌ తిన్నాడు. సిరాజ్‌ సంధించిన ఆ బౌన్సర్‌ను ఎలా ఆడాలో తెలియక.. అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ, బాల్‌ ఎడ్జ్‌ తీసుకొని.. వెళ్లి పంత్‌ చేతుల్లో పడింది. పంత్‌ ఒక సింపుల్‌ క్యాచ్‌ తీసుకున్నాడు. అంతే అసలేం జరిగిందో కూడా స్టోక్స్‌కు అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక పెవిలియన్‌ వైపు నడిచాడు. 84 పరుగుల వద్దే ఇంగ్లాండ్‌ 4, 5వ వికెట్‌ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ సూపర్‌ డబుల్‌ సెంచరీతో ఏకంగా 587 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. గిల్‌ 269 పరుగులతో చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు. జైస్వాల్‌ 87, జడేజా 89, వాషింగ్టన్‌ సుందర్‌ 42 పరుగుల ఇన్నింగ్స్‌లు కూడా టీమిండియాకు భారీ స్కోర్‌ అందించడంలో ఉపయోగపడ్డాయి. ఇక రెండో రోజు చివర్లో తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసి రెండో రోజు ఆటను ముగించింది. ప్రస్తుతం మూడో రోజు కొనసాగుతోంది. ఇంగ్లాండ్‌ 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. జేమి స్మిత్‌ 108, హ్యారీ బ్రూక్‌ 94 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. సిరాజ్‌ 3, ఆకాశ్‌ దీప్‌ 2 వికెట్లు పడగొట్టారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *