IND vs ENG : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ప్రస్తుతం రెండో టెస్టుకు రెడీ అయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. మొదటి మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఈసారి భారత జట్టులో కొన్ని కీలక మార్పులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రెండో టెస్టులో ఆడకపోవచ్చు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపిన వివరాల ప్రకారం.. బుమ్రాకు కొంత విశ్రాంతి ఇచ్చి, వచ్చే వారం జరిగే మూడో టెస్టుకు సిద్ధం చేయాలని చూస్తున్నారు. అంటే, ఎడ్జ్‌బాస్టన్‌లో బుమ్రా బౌలింగ్ చూడలేమని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
బుమ్రా స్థానంలో బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్ కు అవకాశం దక్కే అవకాశం ఉంది. అలాగే, ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇంకో మార్పు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. నితీష్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకోవచ్చు. ఒకవేళ అతనికి చోటు దక్కితే, సాయి సుదర్శన్ లేదా కరుణ్ నాయర్ లలో ఒకరు బెంచ్‌కు పరిమితం కావచ్చు.
చాలామంది క్రికెట్ నిపుణులు కుల్‌దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకోవాలని కోరుతున్నారు. కానీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాత్రం రెండో స్పిన్నర్‌ను మొదటి రోజు ఎలా ఉపయోగించుకోవాలని ముఖ్యమని చెబుతూ.. కుల్‌దీప్‌కు మళ్ళీ ఛాన్స్ దక్కకపోవచ్చని పరోక్షంగా సూచించాడు. మొత్తానికి, రెండో టెస్టులో టీమిండియా కొత్త కాంబినేషన్‌తో బరిలోకి దిగబోతోంది.
రెండో టెస్టుకు భారత్ తుది జట్టు :
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్.