IND vs ENG : ఇదే ఫస్ట్ కాదు.. ఇంతకు ముందు కూడా భారత్ ఇలాగే గెలిచింది

IND vs ENG : ఇదే ఫస్ట్ కాదు.. ఇంతకు ముందు కూడా భారత్ ఇలాగే గెలిచింది


IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదో, చివరి టెస్ట్ మ్యాచ్ క్రికెట్ ప్రపంచాన్ని ఊపేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం ఆరు పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి, టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత స్వల్ప పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ అద్భుత విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసి, ఓటమి అంచు నుంచి బయటపడింది. ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు, భారత క్రికెటర్ల పట్టుదలకు నిదర్శనంగా చెప్పొచ్చు.

ఈ చారిత్రక విజయం వెనుక ప్రధాన పాత్ర పోషించింది మన హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్. చివరి రోజు ఇంగ్లాండ్‌కు గెలవడానికి కేవలం 35 పరుగులు అవసరం కాగా, ఇంగ్లాండ్ చేతిలో ఇంకా నాలుగు వికెట్లు ఉన్నాయి. ఈ సమయంలో ఇంగ్లాండ్ గెలుపు దాదాపు ఖాయమని అంతా భావించారు. కానీ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్‌తో నాలుగు కీలక వికెట్లలో మూడు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. అతని స్పెల్‌తోనే భారత్ మళ్లీ మ్యాచ్‌లోకి తిరిగి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే, సిరాజ్ ఒక్కడే తన భుజాలపై గెలుపు బాధ్యతను మోసాడు.

ఈ గెలుపు సిరాజ్‌కు ఒక రకంగా ప్రతీకారం తీర్చుకున్నట్లుగా ఉంది. ఇదే సిరీస్‌లో లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో సిరాజ్ డిఫెన్సివ్ షాట్ ఆడినప్పుడు, బంతి స్టంప్‌లను తాకి బెయిల్స్ పడిపోవడంతో భారత్ 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ ఓటమి బాధను ఈ విజయం పూర్తిగా తుడిచిపెట్టింది. లార్డ్స్‌లో ఓటమికి కారణమైన ఆ ఒక్క బంతి సంఘటన సిరాజ్ మనసులో బలంగా నాటుకుపోయింది. దాని నుంచి స్ఫూర్తి పొంది అతను ఓవల్‌లో తన సత్తా చాటాడు.

తక్కువ పరుగుల తేడాతో గెలుపొందడం భారత క్రికెట్‌కు కొత్త కాదు. గతంలో కూడా భారత్ కొన్ని ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను ఈ విధంగా గెలుచుకుంది. ఈ విజయం భారత్ సాధించిన అత్యంత స్వల్ప తేడా విజయం కాగా, గతంలో సాధించిన అలాంటి విజయాలు..

భారత్ vs ఇంగ్లాండ్ (2025 – ఓవల్): 6 పరుగుల తేడాతో విజయం.

భారత్ vs ఆస్ట్రేలియా (2004 – వాంఖడే): 13 పరుగుల తేడాతో విజయం.

భారత్ vs ఇంగ్లాండ్ (1972 – ఈడెన్ గార్డెన్స్): 28 పరుగుల తేడాతో విజయం.

భారత్ vs ఆస్ట్రేలియా (2018 – అడిలైడ్): 31 పరుగుల తేడాతో విజయం.

భారత్ vs వెస్టిండీస్ (2002 – పోర్ట్ ఆఫ్ స్పెయిన్): 37 పరుగుల తేడాతో విజయం.

భారత్ vs వెస్టిండీస్ (2006 – కింగ్‌స్టన్): 49 పరుగుల తేడాతో విజయం.

ఈ సిరీస్‌లో భారత్ పట్టుదల, అద్భుతమైన పోరాట పటిమను చూస్తే, భవిష్యత్తులో కూడా ఇలాంటి చారిత్రక విజయాలు మరిన్ని సాధిస్తుందని చెప్పవచ్చు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *