IND vs ENG: ఇంగ్లండ్‌లో గర్జించిన భారత్.. సరికొత్త హిస్టరీతో ప్రపంచ రికార్డ్‌నే మడతెట్టేసిన గిల్ సేన..

IND vs ENG: ఇంగ్లండ్‌లో గర్జించిన భారత్.. సరికొత్త హిస్టరీతో ప్రపంచ రికార్డ్‌నే మడతెట్టేసిన గిల్ సేన..


IND vs ENG: లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ ఐదో టెస్టులో యశస్వి జైస్వాల్ అద్భుతమైన శతకంతో కదం తొక్కాడు. అతని సుడిగాలి ఇన్నింగ్స్‌తో భారత్, ఇంగ్లాండ్‌కు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ సెంచరీ సాధించడంతో పలు ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి.

జైస్వాల్ విధ్వంసం..

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 127 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 2 పరుగులకే ఔటైన జైస్వాల్, రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించాడు. 164 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులతో 118 పరుగులు చేసి జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించాడు. జైస్వాల్‌తో పాటు ఆకాష్ దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ 396 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు గట్టి సవాల్ విసిరింది.

రికార్డుల జైత్రయాత్ర..

జైస్వాల్ సెంచరీతో భారత క్రికెట్ చరిత్రలో పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

సిరీస్‌లో అత్యధిక సెంచరీలు: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఈ సిరీస్‌లో మొత్తం 19 సెంచరీలు నమోదయ్యాయి. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు నమోదైన వాటిలో ఇది మూడో స్థానంలో నిలిచింది. ఇందులో భారత్ తరఫున 12 సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లాండ్ తరపున 7 సెంచరీలు ఉన్నాయి.

అరుదైన ఘనత సాధించిన భారత్: ఒక టెస్టు సిరీస్‌లో ఒక జట్టు 12 సెంచరీలు చేయడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది కేవలం నాలుగోసారి. గతంలో పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఈ ఘనత సాధించాయి.

గవాస్కర్ రికార్డు సమం, సచిన్ రికార్డు బ్రేక్: యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్‌పై తన నాలుగో సెంచరీ సాధించి, సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేశాడు. గవాస్కర్ 37 టెస్టుల్లో ఈ ఘనత సాధించగా, జైస్వాల్ కేవలం 10 టెస్టుల్లోనే సాధించడం విశేషం. అంతేకాకుండా, 23 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్‌పై అత్యధిక 50+ స్కోర్లు సాధించిన భారత బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.

అరంగేట్రం సెంచరీల రికార్డు: యశస్వి జైస్వాల్ తన టెస్ట్ అరంగేట్రంలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాల్లో సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌట్ కాగా, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్‌కు 23 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ దూకుడైన ఆటతీరుతో భారత్ మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఇంగ్లాండ్‌కు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంతో ఈ టెస్టులో గెలుపు భారత్ పరం అవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌-2025లో ఇప్పటి వరకు సెంచరీలు బాదిన టీమిండియా ప్లేయర్లు..

యశస్వి జైస్వాల్‌- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్‌, ది ఓవల్‌- లండన్‌)

శుబ్‌మన్‌ గిల్‌- 4 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్‌, ఎడ్జ్‌బాస్టన్‌- బర్మింగ్‌హామ్‌, ఓల్డ్‌ ట్రఫోర్డ్‌- మాంచెస్టర్‌ )

రిషభ్‌ పంత్‌- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్‌)

కేఎల్‌ రాహుల్‌- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్‌, లార్డ్స్‌- లండన్‌)

రవీంద్ర జడేజా- 1 సెంచరీలు (ఓల్డ్‌ ట్రఫోర్డ్‌- మాంచెస్టర్‌)

వాషింగ్టన్‌ సుందర్‌- 1 సెంచరీలు (ఓల్డ్‌ ట్రఫోర్డ్‌- మాంచెస్టర్‌)

ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన టీంలు..

ఆస్ట్రేలియా- 1955లో వెస్టిండీస్‌‌పై 5 టెస్టుల్లో 12 సెంచరీలు

పాకిస్తాన్‌- 1982/83లో టీమిండియాపై 6 టెస్టుల్లో 12 సెంచరీలు

సౌతాఫ్రికా- 2003/04లో వెస్టిండీస్‌‌పై 4 టెస్టుల్లో 12 సెంచరీలు

టీమిండియా- 2025లో ఇంగ్లండ్‌‌పై 5 టెస్ట్‌ల్లో 12 సెంచరీలు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *