IDFC Scholarship 2025: పేదింటి విద్యార్ధులకు రూ.2 లక్షల వరకు IDFC స్కాలర్‌షిప్‌.. డైరెక్ట్ లింక్ ఇదిగో!

IDFC Scholarship 2025: పేదింటి విద్యార్ధులకు రూ.2 లక్షల వరకు IDFC స్కాలర్‌షిప్‌.. డైరెక్ట్ లింక్ ఇదిగో!


చదువుకోవాలని ఆశ ఉన్నా.. చదువు’కొన’లేని పేదింటి విద్యార్ధులకు గుడ్‌న్యూస్.! స్థోమతలేని కారణంగా ఉన్నత చదువులు చదవలేని ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ప్రముఖ బ్యాంకు స్కాలర్‌షిప్‌ అందిస్తుంది. పేదింటి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరూ చదువుకు దూరంకాకూడదనే ఉద్దేశ్యంతో ప్రైవేట్ రంగానికి చెందిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు.. ఏకంగా రూ.2 లక్షల వరకు స్కాలర్‌షిప్‌ సాయం అందిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న 24 రాష్ట్రాల్లోని విద్యార్ధులు ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు పోస్టు గ్రాడ్యుయేట్‌ చదువుతున్న విద్యార్ధులు మాత్రమే అర్హులు. దరఖాస్తు విధానం, అర్హతలు, ఎంపిక వంటి ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు ఎంబీఏ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2025కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు తప్పనిసరిగా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు సూచించిన విద్యాసంస్థలో 2025-27 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల ఫుల్‌టైం ఎంబీఏ కోర్సు ఫస్ట్‌ ఇయర్‌లో అడ్మిషన్ పొంది ఉండాలి. అలాగే విద్యార్ధుల కుటుంబ వార్షికాదాయం రూ.6 లక్షలు మించకుండా ఉండాలి. ఇక విద్యార్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో జులై 20, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ స్కాలర్‌షిప్‌కు మొత్తం 700 మందిని ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.లక్ష చొప్పున రెండేళ్లకు రూ.2 లక్షల వరకు స్కాలర్‌షిప్‌ అందిస్తారు. దరఖాస్తులను IDFC బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలి. దరఖాస్తు సమయంలో అడ్మిషన్‌ ఫారమ్‌, ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫీ రిసిప్ట్‌, ఆదాయ, బర్త్‌ సర్లిఫికెట్లను అప్‌లోడ్‌ చేయవల్సి ఉంటుంది. ఇతర సందేహాలకు mbascholarship@idfcfirstbank.com ఈ మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు ఎంబీఏ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అధికారిక నోటిఫికేషన్, అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *