ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025-27 సంవత్సరానికి సంబంధించి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (CRP)-కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA) XV ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 10,277 క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆగస్టు 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు
- తెలంగాణలో పోస్టుల సంఖ్య: 261
- ఆంధ్రప్రదేశ్‌లో పోస్టుల సంఖ్య: 367
- అండమాన్ & నికోబార్‌లో పోస్టుల సంఖ్య: 13
- అరుణాచల్ ప్రదేశ్‌లో పోస్టుల సంఖ్య: 22
- అస్సాంలో పోస్టుల సంఖ్య: 204
- బిహార్‌లో పోస్టుల సంఖ్య: 308
- చండీగఢ్‌లో పోస్టుల సంఖ్య: 63
- ఛత్తీస్‌గఢ్‌లో పోస్టుల సంఖ్య: 214
- దాద్రానగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూలో పోస్టుల సంఖ్య: 35
- ఢిల్లీలో పోస్టుల సంఖ్య: 416
- గోవాలో పోస్టుల సంఖ్య: 87
- గుజరాత్‌లో పోస్టుల సంఖ్య: 753
- హరియాణలో పోస్టుల సంఖ్య: 144
- హిమాచల్ ప్రదేశ్‌లో పోస్టుల సంఖ్య: 114
- జమ్మూ & కశ్మీర్‌లో పోస్టుల సంఖ్య: 61
- ఝార్ఖండ్‌లో పోస్టుల సంఖ్య: 106
- కర్ణాటకలో పోస్టుల సంఖ్య: 1170
- కేరళలో పోస్టుల సంఖ్య: 330
- లడ్డాఖ్‌లో పోస్టుల సంఖ్య: 5
- లక్షద్వీప్‌లో పోస్టుల సంఖ్య: 7
- మధ్యప్రదేశ్‌లో పోస్టుల సంఖ్య: 601
- మహారాష్ట్రలో పోస్టుల సంఖ్య: 1117
- మణిపూర్‌లో పోస్టుల సంఖ్య: 31
- మిజోరంలో పోస్టుల సంఖ్య: 28
- మేఘాలయలో పోస్టుల సంఖ్య: 18
- నాగాలాండ్‌లో పోస్టుల సంఖ్య: 27
- ఒడిశాలో పోస్టుల సంఖ్య: 249
- పుదుచ్చెరిలో పోస్టుల సంఖ్య: 19
- పంజాబ్‌లో పోస్టుల సంఖ్య: 276
- రాజస్థాన్‌లో పోస్టుల సంఖ్య: 328
- సిక్కింలో పోస్టుల సంఖ్య: 20
- తమిళనాడులో పోస్టుల సంఖ్య: 894
- త్రిపురలో పోస్టుల సంఖ్య: 32
- ఉత్తర్‌ప్రదేశ్‌లో పోస్టుల సంఖ్య: 1315
- ఉత్తరాఖండ్‌లో పోస్టుల సంఖ్య: 102
- పశ్చిమ్‌బెంగాల్‌లో పోస్టుల సంఖ్య: 540
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. స్థానిక భాషలో చదవడం, రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అభ్యర్దుల వయోపరిమితి ఆగస్టు 1, 2025వ తేదీ నాటికి తప్పనిసరిగా 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ వర్గానికి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 21, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, డీఈఎస్‌ఎం అభ్యర్థులు రూ.175, ఇతర అభ్యర్ధులు రూ.850 చొప్పున చెల్లించాలి. రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్), స్థానిక భాష పరీక్ష తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.24,050 నుంచి రూ.64,480 వరకు జీతంగా చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు ఇవే..
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 21, 2025.
- అడ్మిట్ కార్డులు విడుదల తేదీ: 2025 సెప్టెంబర్.
- ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 2025 అక్టోబర్‌లో.
- మెయిన్స్ పరీక్ష: 2025 నవంబర్‌లో.
- ఫలితాలు: 2026 మార్చిలో.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.