Hyderabad: వనస్థలిపురంలో దారుణం.. మహిళను కత్తితో నరికి చంపిన మాజీ భర్త

Hyderabad: వనస్థలిపురంలో దారుణం.. మహిళను కత్తితో నరికి చంపిన మాజీ భర్త


Hyderabad: వనస్థలిపురంలో దారుణం.. మహిళను కత్తితో నరికి చంపిన మాజీ భర్త

Hyderabad: హైదరాబాద్‌లో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు హత్యలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు ఇలా ఒక్కటేమిటి ప్రతి రోజు ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు నగరంలో మరో ఘటన చోటు చేసుకుంది. వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీ అపార్ట్‌మెంట్‌లో దారుణం జరిగింది. ఓ దుండగుడు ఓ మహిళను కత్తితో దారుణంగా నరికి చంపారు. కత్తులు, పెట్రోల్ డబ్బాతో వచ్చిన దుండగులు మహిళలు హత్య చేశాడు. ఇంట్లోకి ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు.

అయితే సదరు మహిళతో తనకు గతంలో పెళ్లి అయిందని, తను ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది అని మహేష్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *