మామలుగా దొంగతనం చేసేవాడు ఎవడైనా మినిమం వర్కవుట్ అయ్యేలా ప్లాన్ చేస్తారు. మాగ్జిమమ్.. గోల్డ్, నగదుపైనే దొంగలు ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. లేదంటే బైక్స్, ఇతర వస్తువులను కొల్లగొడతారు. కానీ ఈ దొంగోడు వెరీ చీప్. ఓ సూపర్ మార్కెట్‌లో యాలకులు ప్యాకెట్లు దొంగతనం చేసి.. షాపు నిర్వాహకులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆ యువకుడి తతంగం అంతా సీసీ కెమెరాలో రికార్డయింది.
హైదరాబాద్ సనత్ నగర్‌లో ఉన్న డిమార్ట్ సూపర్ మార్కెట్ స్టోర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. షాపింగ్ మాల్స్‌లో, సూపర్ మార్కెట్లలో కస్టమర్ సర్వీస్ కోసం లిఫ్ట్స్ పక్కాగా ఉంటాయి. అయితే లిఫ్ట్స్‌లో కూడా భద్రత కోసం సీసీ కెమెరాలు పక్కాగా పెడతారు. అవి ఎప్పుడూ వర్క్ అయ్యేలా చూసుకుంటారు. అయితే ఈ విషయంపై కొందరికి అవగాహన ఉండదు. అలా వ్యక్తే ఈ దొంగోడు. సూపర్ మార్కెట్‌లో కొట్టేసిన సామాగ్రిని లోదుస్తుల్లో దాచాలని ప్రయత్నిస్తూ సీసీ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు.
సరుకులు కొనేందుకు సనత్ నగర్ డిమార్ట్‌కు వచ్చాడు ఈ యువకుడు. తనకు కావాల్సిన వస్తువులు మొత్తాన్ని చిన్న సైజ్ బాస్కెట్‌లో వేసుకున్నాడు. అందులో యాలకుల ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. తనకు కావాల్సిన మరికొన్ని సరుకులు కొనడం కోసం మరో ఫ్లోర్‌లోని లిఫ్ట్‌లోకి వెళ్లాలనుకున్నాడు. ఇదే సమయంలో కొన్ని సరుకులను తీసుకొని తన లోదుస్తుల్లో దాచాడు. లిఫ్ట్‌లో తనతో పాటు ఎవరు లేకపోవడంతో తనలోని చోరకళను ప్రదర్శించాడు. బాస్కెట్‌లో నుంచి ఇలాచి ప్యాకెట్లను తీసి తన ప్యాంట్ లోపల దాచాడు. ఈ వ్యవహారం అంతా డీ మార్ట్ సీసీ కెమెరాలలో రికార్డ్ అవ్వడంతో స్టోర్ యాజమాన్యం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.