Hyderabad: గుట్టుగా గంజాయ్ రవాణా.. ఇద్దరు నొటోరియస్ క్రిమినల్స్ అరెస్ట్!

Hyderabad: గుట్టుగా గంజాయ్ రవాణా.. ఇద్దరు నొటోరియస్ క్రిమినల్స్ అరెస్ట్!


Hyderabad: గుట్టుగా గంజాయ్ రవాణా.. ఇద్దరు నొటోరియస్ క్రిమినల్స్ అరెస్ట్!

నిత్యం అక్రమాలకు పాల్పడడం.. అడ్డదారుల్లో నేరాలు చేయడం పరిపాటిగా చేసుకొని పోలీసు రికార్డుల్లో నొటోరియల్ క్రిమినల్‌గా పేరుగాంచిన లఖన్ సింగ్ మరో సారి గంజాయిని అక్రమ రవాణా చేస్తూ పోలీసులు పట్టు పట్టుబడటం సంచలనంగా మారింది. హైదరాబాద్ పరిధిలోని మంగళహాట్‌ పోలీసు స్టేషన్‌లో నొటోరియస్ క్రిమినల్‌గా ముద్ర వేసుకున్న లఖన్ సింగ్.. కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తూ ఎస్టిఎఫ్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. లఖన్‌ దూల్పేట్‌లోని జియాగూడ కమ్ములే ప్రాంతం నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తున్నాడనే పక్కా సమాచారంతో ఎస్టిఎఫ్ అధికారి అంజిరెడ్డి నేతృత్వంలోని బృందం, దూల్పేట్ ఎక్సైజ్ పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలో లఖన్ సింగ్ కారును ఆపి చెక్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కారు ముందు పైలెట్గా వెళుతున్న ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకోవడంతోపాటు.. దానిపై వెళ్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. లఖన్ సింగ్ కారులో 21.425 కేజీల గంజాయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతనితోపాటు సాయికుమార్, పవర్‌లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసినట్లు అధికారి అంజిరెడ్డి పేర్కొన్నారు. అయితే అరెస్టు అయిన వారిలో నీరజరాయ్, మీ థన్, కిషన్ సింగ్, తుల్జా సింగ్, సోను, రోహిత్ సింగ్, రిత్విక్, రూప్ నారాయణలు ఉన్నారు.

వీరితో పాటు.. దూల్పేట్‌లో రహీంపురాలో శివలాల్‌నగర్ లో రెండు కేజీల గంజాయి కూడా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక టూ వీలర్‌తో పాటు వంశీకృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో మరో పదిమందిపై కూడా కేసు నమోదు చేసినట్లు అంజిరెడ్డి తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *