దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతుంది. కరోనా తర్వాత ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో రియల్ వ్యాపారం దూసుకుపోతుంది. హైదరాబాద్‌లో గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా జరిగింది. కానీ గత కొంత కాలంగా భారీగా పడిపోయింది. ప్రధానంగా ఇండ్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తొలి అర్థభాగంలో దేశంలోని టైర్-1 నగరాల్లో రూ.3.6 లక్షల కోట్ల విలువైన ఇండ్ల అమ్మకాలు జరిగాయి. ఇది గతేడాది కంటే 9శాతం ఎక్కువ. గత సంవత్సరం ఇదే టైమ్‌లో రూ.3.3 లక్షల కోట్ల విలువైన ఇండ్లు అమ్ముడయ్యాయి. అమ్మకాలలో మాత్రం 4శాతం తగ్గుదల ఉంది. గతేడాది ఇదే సమయంలో 2.7 లక్షల ఇండ్లు అమ్ముడుపోగా.. ఈ సారి 2.54 లక్షల ఇండ్లు మాత్రమే సేల్ అయ్యాయి. కానీ వాటి విలువ పెరగడం గమనార్హం. ప్రధానంగా రూ.1.24 కోట్ల నుంచి రూ.1.42 కోట్ల ధర ఉన్న ప్రీమియం, లగ్జరీ ఇండ్లకు ఎక్కువ గిరాకీ ఉన్నట్లు క్రెడాయ్ సీఆర్ఈ మ్యాట్రిక్స్ నివేదిక తెలిపింది.
ఆదాయంలో ఢిల్లీ టాప్
ఈ అమ్మకాల్లో ఢిల్లీ టాప్‌లో ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్ ఇండ్ల విక్రయాల్లో 26శాత వాటాను కలిగి ఉంది. రూ.3 కోట్ల కంటే ఎక్కువ ధర గల లగ్జరీ ఇండ్ల అమ్మకాల్లో ఢిల్లీ ఎన్సీఆర్ 73శాతం వాటాను కలిగి ఉంది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం 23శాతం ఆదాయ వాటాతో రెండో స్థానంలో ఉంది. ఇది అమ్మకాల విలువలో 9శాతం పెరుగుదలను నమోదు చేసింది. ముంబైలో రూ.3.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న అల్ట్రా-ప్రీమియం ఇళ్ల వాటా 29శాతం నుండి 34శాతానికి పెరిగడం గమనార్హం.
సౌత్ రాష్ట్రాలు ఇలా..
దక్షిణ భారత్ విషయానికొస్తే.. ఇండ్ల అమ్మకాల్లో చెన్నై 23శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇండ్ల ధరల్లోనూ 12శాతం పెరుగుదలతో ప్రత్యేకంగా నిలిచింది. బెంగళూరు కేవలం 4శాతం వృద్ధిని మాత్రమే సాధించింది. రూ.70 లక్షల నుండి రూ.1.5 కోట్ల మధ్య ఉన్న ఇండ్ల అమ్మకాలు పడిపోయినట్లు నివేదిక చెబుతోంది. ఇక హైదరాబాద్ విలువలో 2శాతం పెరుగుదలను నమోదు చేసింది. కానీ అమ్మకాల్లో మాత్రం 11శాతం తగ్గుదల ఉండడం గమనార్హం. నగరంలో 30వేల ఇండ్ల విక్రయాలు మాత్రమే జరిగాయి. అయితే కొత్త ఇండ్ల ప్రాజెక్టులు 23వేల నుంచి 42వేలకు పెరిగాయి.
అహ్మదాబాద్ 25 వేల ఇండ్ల అమ్మకాలతో ఢిల్లీతో సమానగా నిలిచింది. అయితే కొత్త లాంచ్‌లు బాగా పడిపోయాయి. కోల్‌కతా విక్రయాల విలువలో 17శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక్కడ 3 కోట్ల కంటే ఎక్కువ విలువైన లగ్జరీ ఇండ్ల మార్కెట్ వాటా 14శాతం నుంచి 26శాతం పెరిగాయ. అయితే పూణేలో పరిస్థితులు భిన్నంగ ఉన్నాయి. అమ్మకాల విలువలో 8.5శాతం క్షీణత నమోదు అయ్యింది. కానీ ఇక్కడ 45వేల యూనిట్ల ఇండ్లు అమ్ముడయ్యాయి. మొత్తంమీద టైర్-1 నగరాల్లో కొత్త లాంచ్‌లు గతేడాద 98వేల యూనిట్లు ఉండే 2025 తొలి ఆరు నెలల్లో 82వేలుగా ఉన్నట్లు నివేదిక పేర్కొం. అయితే లావాదేవీ విలువలలో బలమైన పెరుగుదల మార్కెట్ యొక్క పెరుగుతున్న ప్రీమియమైజేషన్‌ను హైలైట్ చేస్తుందని నివేదిక వెల్లడించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..